సైదాబాద్/చాదర్‌ఘాట్, మార్చి 9 : అసెంబ్లీ సాక్షిగా శాసన సభలో 91,142 ఉద్యోగ నియామకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేయటంతో నిరుద్యోగులు, టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నారు. బుధవారం మలక్‌పేట, యాకుత్ పుర నియోజకవర్గాల్లో పలు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు, పటాకులు కాల్చి, మిఠాయిలను పంచిపెట్టి సంబురాలు నిర్వహించారు. సైదాబాద్ ప్రధాన రహదారిపై ఏర్పాటుచేసిన సీఎం కేసీఆర్ చిత్రటానికి డివిజన్ మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు పగిళ్ల శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ ఠాకూర్, గడ్డం నందు, పరమేశ్ ముదిరాజ్, సునీత్పత్తి, సుభాశ్ కాటేకర్ క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆర్టీసీ బస్సులోక్లి ఎక్కి ప్రయాణికులకు మిఠాయిలను పంచిపెట్టారు. అదే విధంగా చంపాపేట చౌరస్తాలో నిర్వ హించిన సంబురాల్లో యాకుత్‌పురా నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్చార్జి సామ సుందర్ రెడ్డి, డివిజన్ మాజీ కార్పొరేటర్ సామ స్వప్నసుందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు మెట్టు భాస్కర్ రెడ్డి, హోటల్ శ్రీను, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా అక్బర్‌బాగ్ చౌరస్తాలో డివిజన్ టీఆర్ఎస్ ఇన్చార్జి శ్రీధర్ రెడ్డి, అధ్యక్షుడు జగన్ పాల్గొన్నారు.
సర్వత్రా హర్షం..
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పై ప్రకటన చేయడం హర్షణీయమని మలక్‌పేట నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి ఆజం అలీ అన్నారు. బుధవారం ఆజంపురాలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆజం అలీ మాట్లాడూతూ గతంలో ప్రభుత్వాలు ఉద్యోగాల భర్తీ చేపట్టకుండా కాలయాపన చేశారని, నిరుద్యోగుల తీరని అన్యాయం చేశారని దుయ్యబట్టారు. కానీ, సీఎం కేసీఆర్ మాత్రం ఉద్యోగాల ఖాళీ లతో పాటు జిల్లా క్యాడెర్ తదితర అంశాలతో వివరాలను వెల్లడించారన్నారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మపర్సన్, వైస్‌చైర్‌పర్సన్ రాధ, సాయ భువనేశ్వరి, పగిళ్ల నర్సింగ్, బాబు సుదర్శన్, అమర్, లాయక్ అలీ, కారింగల మారుతి పాల్గొన్నారు.
మా జీవితాలు మారుతాయి..
సీఎం కేసీఆర్ సార్ అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగాల నోటిఫికేషన్న్లపై ప్రకటన చేయటం ఎంతో సంతోషకరంగా ఉంది. నిరుద్యోగ యువతకు ఈ రోజు పండుగ లాంటింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మా జీవితాలు మారుతాయి. నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న తమకు చెప్పలేంత సంతోషంగా ఉంది. ఇంత పెద్ద ఉద్యోగాల ప్రకటన చరిత్రలో ఇప్పటి వర కు ఎవరూ చేయలేదు. ఆ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది.
సంతోషంగా ఉంది
ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న మాకు మంచిరోజులు వచ్చాయి. చాలా సంతోషంగా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల వయో పరిమితి పెంచటంతో ఎంతోమందికి ప్రయోజనం క లుగనున్నది. నిరుద్యోగ యువత వయస్సు పెరిగి నిరుత్సాహంతో ఉన్నవారికి సీఎం కేసీఆర్ ప్రకటనతో ఊరట లభించింది. దీంతో మా జీవితాలు మారనున్నాయి. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.