నటి అనుపమ పరమేశ్వరన్ భావోద్వేగానికి లోనయ్యారు. గడచిన ఏడాదికాలం తన జీవితం ఎంతో కష్టంగా గడిచిందని, ఒకానొక దశలో మానసికంగా కృంగిపోయానని అనుపమ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. తమిళ నటుడు ధృవ్విక్రమ్తో ఆమె ప్రేమలో ఉన్నట్టు, వారి ప్రేమకు బ్రేకప్ అయినట్టు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రూమర్లు వినిపిస్తున్నాయి. తాజాగా అనుపమ పరమేశ్వరన్ మాట్లాడింది ఆ విషయం పైనేనంటూ సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. ఇంకా చెబుతూ ‘ఎంత కష్టపడితే అంత పరిపూర్ణత సిద్ధిస్తుంది.
ఈ ఏడాదికాలం నాకు నేర్పింది అదే. ఇన్నాళ్లూ ఇతరుల కోసం బతికా. నా జీవితం కూడా నా చేతుల్లో లేదు. ఇప్పుడు నాకోసం నేను బతుకుతున్నా. నా జీవితాన్ని నా నియంత్రణలోకి తీసుకున్నా. గతాన్ని వదిలి ధైర్యంగా ముందుకు సాగుతున్నా. ఈ సందర్భంగా కొంతమందికి ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. వ్యక్తిగత జీవితంలోని ప్రతి విషయాన్నీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు’ అంటూ అనుపమ ఘాటుగా స్పందించింది. మరి ఈ వ్యాఖ్యల్లో అంతర్యం ఏమిటో అనుపమకే తెలియాలి.