జూబ్లీహిల్స్ / ఎర్రగడ/ వెంగళరావునగర్, మార్చి 9 : రాష్ట్రంలో దాదాపు 91 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడం హర్షణీయమని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నా రు. ఈ నేపథ్యంలో సోమాజిగూడ డివిజన్ ఎల్లారెడ్డిగూడలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఎక్క డా లేని విధంగా పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం ఎక్కడా జరగలేదన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్‌యాదవ్, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు అప్పుఖాన్, తన్ను ఖాన్, మధు యాదవ్, శరత్ గౌడ్ పాల్గొన్నారు.
ఎర్రగడ్డ : అసెంబ్లీ వేదికగా ఉద్యోగాల భర్తీ అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించటంతో యువకులు సంబురాలు జరుపుకొన్నారు. బోరబండ చౌరస్తాలో కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన సంబురాల్లో పటాకులు కాల్చి మిఠాయిలు పంచి పెట్టారు. కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించిన తర్వాత బాబా ఫసియుద్దీన్ మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో కేసీఆర్‌ను పలుమార్లు విద్యార్థి నాయకుడిగా కలువటం జరిగిందన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకున్న కేసీఆర్‌ను యువత ఎన్నడూ మరువలేదన్నారు. డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, నేతలు విజయకుమార్, యూసుఫ్, శంకర్ పాల్గొన్నారు. అందేవిధంగా ఎర్రగడ్డ డివిజన్ అధ్యక్షుడు డి.సంజీవ ఆధ్వర్యంలో ఆనంద్‌నగర్ చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షారాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో నేతలు గంట మల్లేశ్, మహేందర్, నర్సింహ, బాలకృష్ణ, శ్రీకాంత్, యాదగిరి ప్రవీణ్ పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ భర్తీపై నోటిఫికేషన్ విడుదల చేయడంతో సంబురాలు అంబరాన్నంటాయి. యూసుఫ్‌గూడలో కార్పొరేటర్ రాజ్‌కుమార్ పటేల్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రహ్మత్‌నగర్‌లో కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ఆధ్వర్యంలో పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.