కేపీహెచ్‌బీ కాలనీ, మార్చి 9 : ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ ప్రకటన చేయడంతో కూకట్పల్లి నియోజకవర్గం కో ఆర్డినేటర్ సతీశ్ అరోరా ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నేతలు సంబురాలు చేసుకున్నారు. బుధవారం కేపీహెచ్‌బీ కాలనీ మొదటి రోడ్డులోని మహాత్మాగాంధీ విగ్రహానికి.. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నిరుద్యోగుల కష్టాలను తీర్చుతూ నోటిఫికేషన్‌ను విడుదల చేయడం సంతోషకరమన్నారు. సీఎం కేసీఆర్ లాంటి మహనీయుడు ముఖ్యమంత్రిగా ఉండడం ప్రజల అదృష్టమన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షుడు సాయిశ్రీనివాస్, పవన్‌కుమార్, రాజేశ్‌రాయ్, పాతూరి గోపి, వెంకటేశ్, నిఖిల్, రంగమోహన్, నాగేశ్వర్రావు, రావెల్షా, దినేశ్, జాన్మోజస్, సలీం, సంతోష్ యాదవ్, రాజశేఖర్, శ్రీను, జశ్వంత్, గోపాల్ చౌదరి, చిక్కం వంశీ, ప్రకాశ్, లక్ష్మణ్, వాసు, దుర్గ, బొట్టు విష్ణు, అల్తాఫ్, ఆంజనేయులు, రాజు పాల్గొన్నారు.
బాలానగర్‌లో..
తెలంగాణ శాసనసభ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగుల కోసం ఉద్యోగ ప్రకటన చేయడం హర్షణీయమని ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీశ్‌గౌడ్ అన్నారు. బుధవారం ఫతేనగర్ డివిజన్ పరిధిలోని ఫతేనగర్ ైప్లెఓవర్ వద్దగల తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సీం కేసీఆర్ చిత్రపటానికి పార్టీ శ్రేణులతో కలిసి క్షీరాభిషేకం చేశాడు. అనంతరం ఆయన స్థానికంగా స్వీట్లు పంచి పెట్టారు. కార్యక్రమంలో భిక్షపతి, సురేందర్నాయుడు, సతీశ్ పాల్గొన్నారు.
అల్లాపూర్‌లో..
కనీవినీ ఎరుగని రీతిలో 91,142 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం సంతోషకరమని కార్పొరేటర్ సబీహాబేగం అన్నారు. బుధవారం సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఉద్యోగ ప్రకటన చేసిన నేపథ్యంలో అల్లాపూర్ కార్పొరేటర్ సబీహాబేగం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ గౌసుద్దీన్ తదితరలు పాల్గొన్నారు.
నోటిఫికేషన్ విడుదల హర్షణీయం
నిరుద్యోగ యువత కోసం అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడం హర్షణీయమని కూకట్పల్లి టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు తూము నిఖిల్‌కుమార్ అన్నారు. బుధవారం జరిగిన అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగ యువత కొరకు 91142 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశాల మేరకు నిఖిల్‌కుమార్ ఆధ్వర్యంలో మూసాపేట వై జంక్షన్లో కేసీఆర్ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేసి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో జిల్లా అఖిల్, నితిన్, క్రాంతి, అక్షయ్, సూర్య, రంజిత్, రాజు, ఉదయ్ పాల్గొన్నారు.
బాలానగర్‌లో…
ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగ యువత కొరకు తీపి కబురు ప్రకటించిన సందర్భంగా బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో బాలానగర్‌లో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎడ్ల మోహన్‌రెడ్డి, మందడి సుధకర్‌రెడ్డి, వెంకటేశ్‌గౌడ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఖాజా, మహిళా అధ్యక్షురాలు కాతురాయ కవిత, సుజాతగౌడ్, సుధారెడ్డి, భారతి, లక్ష్మి పాల్గొన్నారు.
జోనల్ ప్రతిపాదనతో మేలు
ప్రభుత్వం అమలు చేసిన జోనల్ విధానం ప్రతిపాదికన ఉద్యోగాల భర్తీ జరిగితే సాధ్యమైనంత వరకు నిరుద్యోగుల సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ప్రస్తుతం ఆయా కేటగిరిలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటికీ నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే భర్తీ చేసేలా చూడాలి. ఎంతో మంది నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ ప్రకటనతో మేలు జరుగుతుంది.
నిరుద్యోగ బంధు సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ నిరుద్యోగుల బాధలను తెలుసుకొని ఉద్యోగ నోటిఫికేషన్లను ప్రకటించడం పట్ల ఎంతోమంది కుటుంబాల్లో ఆనందం వెళ్లి విరిసింది. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పడం పట్ల సీఎం కేసీఆర్‌కు చరిత్రలో నిలిచాడు.