దుండిగల్, మార్చి 9 : రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో అదనంగా 94 కొత్త బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోనూ అవకాశం కల్పించాలని స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం ఎమ్మెల్యే శాసనసభలో పలు అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ము న్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో రెండేసి చొప్పున బస్తీద వాఖానలు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం అభినందనీయ మన్నారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో అత్యధికంగా జనాభా నివాసముంటున్నారని, ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసే బస్తీ దవాఖానలతో పాటు మరో రెండు బస్తీదవాఖాన లు అదనంగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావును కోరారు. అదే విధంగా దుండిగల్ మున్సిపాలిటీ పరిధి లోనూ అదనపు బస్తీదవాఖానను ఏర్పాటు చేయాలని కోరగా మంత్రి హరీశ్‌రావు సానుకూలంగా స్పందించారు. దీంతో ఎమ్మెల్యే వివేకానంద్ మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్యేకు ధన్యవాదాలు : మేయర్ కొలన్
నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న బస్తీదవాఖానలకు అదనంగా మరో రెండు బస్తీదవాఖా నలు ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే వివేకానంద్ ప్రభు త్వానికి విజ్ఞప్తి చేయడం పట్ల నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలన్ నీలాగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపా రు. ఎల్లప్పుడు ప్రజల మధ్య తిరుగుతూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్న ఎమ్మెల్యే వివేకానంద్ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాడనేందుకు ఇది ఒక ఉదాహరణ అన్నారు. నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్న ఎమ్మెల్యేకు నియోజకవర్గం ప్రజలు రుణపడి ఉంటారన్నారు. ప్రత్యేకంగా తమ కార్పొరేషన్లో అదనంగా బస్తీదవాఖాన ఏర్పాటుకు కృషి చేయడం పట్ల మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.