ముషీరాబాద్ జోన్ బృందం, మార్చి 9:రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బుధవారం ముషీరాబాద్ నియోజకవర్గంలో సంబురాలు నిర్వహించారు. రాష్ట్ర చరిత్రలో మైలురాయిగా నిలిచే సహసోపేత నిర్ణయం తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచారు. పలు కూడళ్లలో సీఎం కేసీఆర్ చిత్ర పటాలపై పూల వర్షం కురిపిస్తూ క్షీరాభిషేకం చేశారు. మరోవైపు నిరుద్యోగులు, విద్యావంతులు, పలు సంఘాల నేతలు సీఎం కేసీఆర్ భారీ ఉద్యోగ ప్రకటన నిర్ణయాన్ని స్వాగతించాయి. ఇలాంటి చారిత్రాత్మక ప్రకటన నిరుద్యోగుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తుందన్నారు. రాంనగర్ చౌరస్తాలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొని సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యూత్ విభాగం సీనియర్ నేత ముఠా జయసింహ, రాంనగర్ డివిజన్ అధ్యక్షుడు ఆర్.మోజస్, తదితరులు పాల్గొన్నారు…
భోలక్‌పూర్‌లో..
దేశంలో ఎక్కడలేని విధంగా నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌ను జారీ చేసి ఆదర్శ ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలిచారని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం భోలక్‌పూర్‌లో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 90 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌తో పాటు, 11 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని అసెంబ్లీలో ప్రకటించడం అభినందనీయమని అన్నారు. నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు సీఎం కేసీఆర్‌ను దేవుడిలా చూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, నాయకులు ఆర్. శ్రీనివాస్, రహీం, ఉమాకాంత్, మున్వర్ చాంద్, మహ్మద్ అలీ, ప్రవీణ్, ఆరీపోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
అడిక్‌మెట్, ముషీరాబాద్‌లలో…
ముషీరాబాద్ చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకుడు డి.శివముదిరాజ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు ముఠా జయసింహ, ఎడ్ల హరిబాబు యాదవ్, సోమసుందర్, మహ్మదుల్లా, శ్రీధర్‌రెడ్డి, ఆకుల అరుణ్, దీన్‌దయాల్‌రెడ్డి, ఎయిర్టెల్ రాజు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా అడిక్‌మెట్‌లో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు బి.శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సంబురాల్లో ఆ పార్టీ సీనియర్ నేత ముఠా జయసింహ పాల్గొని సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం నిర్వహించి బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్యామ్‌సుందర్, సురేందర్, మల్లికార్జున్‌రెడ్డి, మహ్మద్ ఖదీర్, గురుదీప్, గోపీ, తదితరులు పాల్గొన్నారు.
కవాడిగూడలో..
ఉద్యోగ ప్రకటనను హర్షిస్తూ కవాడిగూడ డివిజన్లోని బండమైసమ్మనగర్ చౌరస్తాలో టీఆర్ఎస్ కవాడిగూడ డివిజన్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్ యాదవ్ అధ్వర్యంలో బుధవారం సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర యువజన విభాగం నేత ముఠా జయసింహ పాల్గొని కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కల్వ గోపీ, రాజశేఖర్ గౌడ్, సురేశ్, స్వప్న, శకుంతల, ప్రకాశ్, కిరణ్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
అడ్వొకేట్ జేఏసీ ఆధ్వర్యంలో..
నిరుద్యోగ సమస్యను తీర్చడానికి సీఎం కేసీఆర్ 90 వేల ఉద్యోగాలను అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారని తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ అధ్యక్షుడు పులిగారి గోవర్ధన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఉద్యోగ ప్రకటన చేయడాన్ని హర్షిస్తూ బుధవారం సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాధులు వొద్యారపు రవికుమార్, మంత్రి రవీందర్ రావు, అరుణ్ కుమార్, నల్లబోలు సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్ నాయక్, జూపల్లి కృష్ణ పాల్గొన్నారు.
గాంధీనగర్‌లో…
ఉద్యోగాలను భర్తీ ప్రక్రియను ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గాంధీనగర్ డివిజన్ అధ్యక్షుడు రాకేశ్‌కుమార్ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సంబరాలు నిర్వహించారు. యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, మాజీ కార్పొరేటర్ ముఠా పద్మానరేశ్లు ఈ కార్యక్రమంలో పాల్గొని కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ముఠా నరేశ్, శ్రీకాంత్, ఆకుల శ్రీనివాస్, గుండు జగదీశ్ బాబు, ఎర్రం శ్రీనివాస్ గుప్తా, ముచ్చకుర్తి ప్రభాకర్, బాలు యాదవ్, పున్న సత్యనారాయణ, గడ్డమీది శ్రీనివాస్, రవి శంకర్‌గుప్తా, తుడుం లక్ష్మి, ముచ్చకుర్తి పద్మ, స్వరూప, సుధలు పాల్గొన్నారు. రాంనగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి దామోదర్‌రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరుగగా ముఠా జయసింహ పాల్గొని పాలాభిషేకం చేశారు. నాయకులు వెంకటకృష్ణ (బబ్లు),రాజేంద్ర ప్రసాద్ గౌడ్, జైదేవ్, రమేశ్ రెడ్డి, జనార్ధన్, వి.జనార్థన్, ముదిగొండ మురళి, ఎర్రం శేఖర్, నవీన్, కల్పనా తదితరులు పాల్గొన్నారు.
భారీ ఉద్యోగ ప్రకటన చేసిన ఘనత కేసీఆర్‌దే
దేశంలో రాష్ట్రంలో లేనివిధంగా ఒకేసారి 90 వేల ఉద్యోగాల భర్తీ ప్రకటన చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని టీఆర్ఎస్ గ్రేటర్ నేత ఎంఎన్.శ్రీనివాసరావు అన్నారు. రాంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా అమలు చేస్తున్నారని తెలిపారు. మాటకు కట్టుబడి.. చెప్పింది చేయడమే సీఎం కేసీఆర్ నైజమని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలు సైతం అమలు చేస్తున్నారని అన్నారు.