హయత్‌నగర్, మార్చి 7: విశ్వబ్రాహ్మణులకు ఉపాధి లేక పట్టణాలకు వలస వెళ్తున్నారని, అయినప్పటికీ వారి జీవితాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని అందుకు విశ్వబ్రాహ్మణులు కలిసి కట్టుగా ముందుకు నడవాలని ఎమ్మెల్సీ, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పిలుపునిచ్చారు. సోమవారం హయత్‌నగర్‌లోని ధనుంజయ గార్డెన్స్‌లో ఎల్బీనగర్ నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ, మాజీ స్పీకర్ మధుసూదనాచారి హాజరై మాట్లాడారు. ఎల్బీనగర్ నియోజకవర్గం గౌరవ అధ్యక్షుడు నాగోజు రామాచారి, అధ్యక్షుడు పర్వతం శ్రీనివాసాచారి, ప్రధాన కార్యదర్శి అందోజు శ్రీనివాస చారి, కోశాధికారి చిలుకూరి రామాచారి, ప్రచార కార్యదర్శి దార్ల శ్రీనివాసచారి ప్రమాణ స్వీకారం చేశారు. మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం గౌరవ అధ్యక్షుడు లాలుకోట వెంకటాచారి, అధ్యక్షుడు వేములవాడ మదన్మోహన్ చారి, బీసీ కమిషన్ సభ్యులు సీహెచ్ ఉపేందర్, రాష్ట్ర నాయకులు కుందారం గణేశ్ చారి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నాగారం భాస్కరాచారి, రంగారెడ్డి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పులిగిల్ల శ్రీనివాసచారి, విశ్వబ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షుడు అందోజు సత్యంచారి, గౌరవ అధ్యక్షుడు రవీంద్రచారి, తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం మహిళా అధ్యక్షురాలు చిలుకూరి లక్ష్మీరామాచారి, ప్రధాన కార్యదర్శి దాసోజు పుష్పలత, తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షుడు పర్వతం ప్రేమ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.