అంబర్‌పేట, మార్చి 6 : పద్మశాలీలు అన్ని రంగాల్లో రాణించాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, తెలంగాణ పద్మశాలి సంఘం డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు డా. మార్త రమేశ్ అన్నారు. విద్యానగర్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఎస్. నర్సింగ్‌రావు ఆధ్వర్యంలో ఆదివారం టీఆర్టీ కాలనీలో తెలంగాణ పద్మశాలి సంఘం డాక్టర్స్ విభాగం నూతన అధ్యక్షునిగా ఎన్నికైన డా.మార్త రమేశ్, గ్రేటర్ పద్మశాలి సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన కత్తుల సుదర్శన్‌రావు లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పద్మశాలీలు ఐక్యంగా ఉం టూ ప్రభుత్వ పథకాలను ప్రతి పద్మశాలీకి చేరేలా చూడా లని సూచించారు. యోజకవర్గం పద్మశాలి సంఘం ప్రతినిధులు ప్రొ. వెంకటరాజయ్య, ఎ. అంజయ్య, పి. హరి, వర్కాల కృష్ణ, సిలివేరు యాదగిరి, డివిజన్ల అధ్యక్షులు కె. శ్రీనివాస్, కె. గట్టయ్య, పి. మధుసూదన్, కె. శ్రీకాం త్, నాయకులు జయసింహ, జి. మల్లేశ్, నక్క నగేశ్, కోట వెంకటేశ్, రఘునాథ్, పి. రవికాంత్, జగన్ పాల్గొన్నారు.