తొలి రోజు అంబరాన్నింటిన ‘ మహిళాబంధు కేసీఆర్’ సంబురాలు
సీఎం కేసీఆర్ చిత్రపటాలకు రాఖీలు కట్టిన మహిళలు
వివిధ రంగాల్లో మహిళలకు సన్మానాలు, సత్కారాలు
సికింద్రాబాద్, మార్చి 6 :రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ పేదింటి దీపాలుగా వెలుగొందుతున్నాయని టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆదివారం ‘ మహిళాబంధు కేసీఆర్’ సంబురాల్లో భాగంగా తొలిరోజు సికింద్రాబాద్, కంటోన్మెంట్ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. దీంట్లో భాగంగా బోయిన్‌పల్లిలోని మర్రి రాజశేఖర్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ మినీ అంగన్వాడీ యూనియన్ మహిళలు సీఎం కేసీఆర్ ఫొటోకు తిలకం దిద్ది రాఖీలు కట్టి మహిళాబంధు సంబురాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒంటరి మహిళలకు ఆసరా పింఛన్ల దగ్గర నుంచి కేసీఆర్ కిట్ల వరకూ మహిళలకు అనేక పథకాల ద్వారా లబ్ధి కలిగిస్తున్నారని వివరించారు. అనంతరం తెలంగాణ మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ సభ్యులు తమకు వేతనాలు అంగన్వాడీ ఆయాలతో సమానంగా ఇస్తున్నారని, వాటిని పెంచి న్యాయం చేసే విధంగా చొరవ తీసుకోవాలని కోరుతూ మర్రి రాజశేఖర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. తప్పకుండా సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యుడు ప్రభాకర్, రాజుసింగ్, ప్రవీణ్‌యాదవ్, పరుశరామ్‌తో పాటు మహిళలు వరలక్ష్మి, సుజాత, రేణుక, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. –
మహిళలకు అధిక ప్రాధాన్యం
టీఆర్ఎస్ సర్కారులో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సీతాఫల్మండి డివిజన్ కార్పొరేటర్ సామల హేమ పేర్కొన్నారు. ఈ క్రమంలో డివిజన్లోని మల్టీ పర్పస్ ఫంక్షన్హాల్లో మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి డివిజన్‌కు చెందిన మహిళలు రాఖీలు కట్టారు. అనంతరం డివిజన్లో సేవలు అందిస్తున్న వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు, పోలీస్ అధికారులకు, శానిటేషన్ సిబ్బందిని కార్పొరేటర్ సామల హేమ సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అరుణోదయ ఓల్డేజ్ హోమ్‌లో..
ఉస్మానియా యూనివర్సిటీ: మహిళల పట్ల ప్రతి ఒక్కరూ గౌరవంగా ఉండాలని అరుణోదయ ఓల్డేజ్ హోమ్ చైర్మెన్ తాళ్ల లావణ్య అన్నారు. తార్నాకలోని హోమ్‌లో మహిళా వృద్ధులతో కలిసి ఆదివారం మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహిళలు ఈ సృష్టికి మూలమన్నారు. ఈ కార్యక్రమంలో హోమ్ సెక్రెటరీ చిన్నా యాదవ్, ఎంఎన్ఆర్, లక్ష్మి పాల్గొన్నారు.