ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
ఎల్బీనగర్, మార్చి 6: టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చైతన్యపురి డివిజన్ టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ, అనుబంధ నూతన కమిటీలను ప్రకటించి నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు పీచర వెంకటేశ్వర్రావు, నర్సిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, జ్యోతి, రాపోలు సుధాకర్, భూపేశ్ రెడ్డి, శరత్చంద్ర, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
చైతన్యపురి డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట మహేశ్ యాదవ్
చైతన్యపురి డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట మహేశ్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే నియామక పత్రాన్ని అందజేశారు. డివిజన్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నరేశ్, ఉపాధ్యక్షులుగా కడియం మోహన్‌రాజ్, చిన్నా యాదవ్, బీసీసెల్ అధ్యక్షుడిగా లక్ష్మణ్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అజయ్‌కుమార్, మహిళా విభాగం అధ్యక్షురాలుగా నాగలక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జయశ్రీ, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ప్రమోద్, ఎస్సీసెల్ ఉపాధ్యక్షుడిగా కిషన్, మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా షేక్ నజీర్, యూత్ అధ్యక్షుడిగా జాన్ కిరణ్, యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శ్రావణ్‌కుమార్ రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా నవీన్ నియమితులయ్యారు.
కాలనీ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి
మన్సూరాబాద్, మార్చి 6: మన్సూరాబాద్ డివిజన్ ప్రెస్కాలనీ ఫేజ్-1 సంక్షేమ సంఘం సభ్యులు ఆదివారం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిని కలిసి కాలనీ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, సీసీ కెమెరాల ఏర్పాటు, దేవాలయ నిర్మాణం, తాగునీటి, డ్రైనేజీ సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కాలనీవాసులు కోరారు. కాలనీలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరింపజేస్తానని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి హామీనిచ్చినట్లు కాలనీవాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దగౌని జగదీశ్‌గౌడ్, యాదయ్య, కృష్ణగౌడ్, శ్రీనివాస్ గౌడ్, మల్లేశ్‌గౌడ్, శ్రీను, నర్సింహ, నర్సింహ యాదవ్, రాజ్‌కుమార్, యాదయ్య, శివ, ప్రసాద్‌రెడ్డి, అమీర్‌ఖాన్, దామోదర్, తదితరులు పాల్గొన్నారు.
మౌలిక వసతుల కల్పనకు కృషి
చంపాపేట, మార్చి 6: మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కాలనీ రోడ్లకు మరమ్మతులు చేయాలని కోరుతూ దుర్గాభవానీనగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నల్ల రఘుమారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దుర్గాభవానీ నగర్లో చేపట్టిన బాక్స్ డ్రైన్ నాలా ఇరువైపులా రోడ్లకు మరమ్మతులు చేయిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ముడుపు రాజ్‌కుమార్‌రెడ్డి, కాలనీ అసోసియేషన్ సభ్యులు డివిజన్ టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.