ఎల్బీనగర్/మన్సూరాబాద్/వనస్థలిపురం, మార్చి 6: తెలంగాణ రాష్ట్రంలో మహిళలు మహారాణులని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను మూడు రోజుల పాటు మహిళా బంధు పేరుతో ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు కొత్తపేటలోని తన నివాసంలో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా పారిశుధ్య మహిళా కార్మికులను ఘనంగా సన్మానించి చీరలు పంపిణీ చేశారు. అదే విధంగా టీఆర్ఎస్ పార్టీ మహిళా నేతలను కూడా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మహిళల అభ్యున్నతి కోసం పలు పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ఆడబిడ్డలకు పెద్దన్నగా, మనసున్న మహారాజుగా సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో సహకారం అందిస్తున్నారని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ముందడుగు వేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పీచర వెంకటేశ్వర్రావు, రాపోలు సుధాకర్, నర్సిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, చైతన్యపురి డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు తోట మహేశ్ యాదవ్, బొగ్గారపు శరత్చంద్ర, వరుణ్‌చంద్ర, భూపేశ్ రెడ్డి, కిషన్, మహిళా నేతలు నాగలక్ష్మి, జయశ్రీ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
గడ్డిఅన్నారం డివిజన్లో..
గడ్డిఅన్నారం డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జక్కల శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో కరోనా సమయంలో సేవలందించిన ఆశవర్కర్లు, హెల్త్ విభాగం మహిళా మణులను సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భవానీ ప్రవీణ్‌కుమార్, శారదానగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బాలకృష్ణరాజు, ప్రధాన కార్యదర్శి పడిదం కృష్ణారెడ్డి, సంయుక్త కార్యదర్శి యాదిరెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు రమేశ్ ముదిరాజ్, ప్రేంనాథ్గౌడ్, బాల సుందరం, రమణారెడ్డి, నర్సింహారావు, మహిళా విభాగం అధ్యక్షురాలు మల్లికారెడ్డి, శైలజ, విజయలక్ష్మి, అరుంధతి, రాణిరావు, పరమేశ్వరి, నాగమణి, రజిత, లక్ష్మి, హసినా, పద్మ, ఉమ, ఉష తదితరులు పాల్గొన్నారు.
కొత్తపేటలో..
కొత్తపేట యూపీహెచ్సీ హాస్పిటల్లో కొత్తపేట టీఆర్ఎస్ నాయకులు మహిళా బంధు కార్యక్రమంలో భాగంగా ఎఎన్ఎంలు, ఆశ వర్కర్లు కేసీఆర్, కేటీఆర్ కటౌట్లకు రాఖీలు కట్టించారు. అనంతరం వీరిని ఘనంగా సన్మానించారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వజీర్ ప్రకాశ్‌గౌడ్, కొత్తపేట డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు లింగాల రాహుల్‌గౌడ్, కొత్తపేట డివిజన్ మహిళా విభాగం అధ్యక్షురాలు దేవిరెడ్డి శ్వేతారెడ్డి, నాయకురాళ్లు విజయగౌడ్, షెరీన్ క్రిస్టోఫర్, చైతన్యపురి డివిజన్ మహిళా అధ్యక్షురాలు నాగలక్ష్మి, జయక్ష్మి, పద్మ, అనురాధ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ మహిళల పక్షపాతి
అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు టీఆర్ఎస్ పార్టీ స్టేట్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీశ్డ్డి ఆధ్వర్యంలో ఆదివారం నాగోల్‌లో మహిళా బంధు వేడుకలను ఘనంగా నిర్వహించారు. జీహెచ్ఎంసీ కార్మికులు, ఆశ వర్కర్లు సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వేడుకల్లో పాల్గొన్న ఆశ వర్కర్లు, జీహెచ్ఎంసీ కార్మికులకు మహిళా దినోత్సవం సందర్భంగా 300 చీరలను టీఆర్ఎస్ పార్టీ స్టేట్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీశ్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మహిళల పక్షపాతి అని.. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల అభ్యున్నతికోసం పాటుపడుతున్నారని తెలిపారు. పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్టు, ఆడబిడ్డల పెండ్లిళ్లకు షాదీముబారక్, కల్యాణలక్ష్మి, వితంతు, ఒంటరి మహిళా పింఛన్లు అందజేస్తున్నారని తెలిపారు. మహిళల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు జగన్మోహన్రెడ్డి, సతీశ్‌యాదవ్, శిల్పారెడ్డి, రంగేశ్వరి, వెంకట్‌రెడ్డి, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా మహిళా దినోత్సవం
స్వయం సహాక సంఘాల ఆధ్వర్యంలో హస్తినాపురంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ పద్మానాయక్ మాట్లాడుతూ.. మహిళలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అన్ని రంగాల్లో మరింత రాణించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలక్ష్మి, అనిత తదితరులు పాల్గొన్నారు.