సత్తా చాటుతూ.. ఆదర్శంగా నిలుస్తూ..
అన్ని రంగాల్లో రాణిస్తున్న అతివలు
మహిళలకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం
శంషాబాద్ రూరల్, మార్చి 6 : మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళకు పెద్దపీట వేస్తుండటంతో మహిళలు తామేమి తక్కువ కాదని నిరూపిస్తున్నారు. వ్యాపారవేత్తలుగా, ఉపాధ్యాయులుగా, లాయర్లుగా, పోలీసులతో పాటు రాజకీయాల్లో వారి సత్తాను చా టుతూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వం మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు మొదలుకొని మున్సిపల్ చైర్ పర్సన్ వరకు అన్ని స్థానాల్లో గెలుపొంది అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు.
కీలక పదవుల్లో ..
మున్సిపల్ పరిధిలో నిర్వహించిన ఎన్నికల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించడంతో 25 వార్డులకు గాను 15 మంది మహిళా కౌన్సిలర్లు గెలుపొందారు. దీంతో పాటు శంషాబాద్ మండలంలో 27 గ్రామ పంచాయతీల్లో 13 మంది సర్పంచ్‌లుగా, 6 మంది ఎంపీటీసీలుగా గెలుపొంది ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నారు. శంషాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్‌గా కొలన్ సుష్మ, శంషాబాద్ ఎంపీపీగా దిద్యాల జయమ్మ, జడ్పీటీసీగా నీరటి తన్వి, వైస్ ఎంపీపీగా నీలం శంషాబాద్ మండలంలో కీలక పదవులలో మహిళలు రాణిస్తున్నారు.
గృహిణి నుంచి ఎంపీపీగా..
సాధారణ గృహిణి నుంచి ఎంపీపీగా ఎదిగిన. పెద్దతూప్ర గ్రామానికి చెందిన నేను చిన్నతనం నుంచి సమాజంపై అవగాహన ఉంది. 2019లో ఎంపీటీసీ ఎన్నికల్లో పెద్దతూప్ర గ్రామ ఎంపీటీసీగా భారీ మోజార్టీతో గెలుపొందిన. శంషాబాద్ ఎంపీపీగా కీలక పదవిని దక్కించుకున్నా. ఎంపీపీగా మండల అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్నా.
-జయమ్మ, ఎంపీపీ శంషాబాద్
గిరిజనుల కష్టాలు చూశా..
శంషాబాద్ మండలంలోని మారుమూల తండాలో పుట్టిన. గిరిజన మహిళలకు ఉండే కష్టాలను చిన్నతనం నుంచి చూసిన. తండాలను అభివృద్ధి చేసుకోవాలనే పట్టుదలతో భర్త ప్రోత్సాహంతో మదన్‌పల్లి గ్రామ ఎంపీటీసీగా గెలుపొందిన. మండల వైస్ ఎంపీపీగా పదవి చేపట్టా. పదవి చేపట్టిన నుంచి మండలంలోని ప్రతి గ్రామానికి తిరుగుతూప్రజలకు సేవ చేస్త్తున్న.
–నీలం, వైస్ ఎంపీపీ