‘ మల్కాజిగిరి’లో ఘనంగా సంబురాలు
సీఎం కేసీఆర్ చిత్రపటాలకు రాఖీలు
మహిళలకు సత్కారం
మల్కాజిగిరి, మార్చి 6: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘మహిళా బంధు కేసీఆర్’ పేరిట నిర్వహించనున్న ఉత్సవాలు ఆదివారం మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలో ఘనంగా ప్రా రంభమయ్యా యి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వేడుకలు నిర్వహించి.. మహిళలు, కార్మికులను సత్కరించారు. ఆయా ప్రాంతాల్లో మహిళలు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు రాఖీలు కట్టి.. క్షీరాభిషేకం చేశారు. అలాగే.. కేసీఆర్ కిట్, షాదీముబారక్, కల్యాణలక్ష్మి వంటి పథకాలు అందిస్తున్న సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
మల్కాజిగిరి చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, సర్కిల్ మహిళా అధ్యక్షురాలు గద్వాల జ్యోతి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల అభివృద్ధికోసం సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నారని అన్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు నెలనెలా పింఛన్లు అందజేస్తున్నారని అన్నారు. పేదింటి ఆడబిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంలో రూ.1,00.116ల ఆర్థిక సహాయం చేస్తున్నారని అన్నారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్యానికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషాకాహారాలు అందజేస్తున్నామని అన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీంలు పనిచేస్తున్నాయని అన్నారు. మహిళలు అన్నిరంగాల్లో రాణించడానికి ప్రభుత్వం చేయూతనిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి సర్కిల్ మహిళా అధ్యక్షురాలు గద్వాల జ్యోతి, కార్పొరేటర్లు సునీతాయాదవ్, శాంతిశ్రీనివాస్ రెడ్డి, సబితాకిశోర్, ప్రేమ్‌కుమార్, రాజ్ జితేంద్రనాథ్, మాజీ కార్పొరేటర్ జగదీశ్‌గౌడ్, అనిల్‌కిశోర్, పరుశురాంరెడ్డి, జీఎన్వీ సతీశ్‌కుమార్, గుండా నిరంజన్, రాముయాదవ్, విజయకుమారి, కవిత, సంధ్య, వైశాలి, రజిత, తదితరులు పాల్గొన్నారు.