ఎల్బీనగర్, మార్చి 5 : గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ యార్డులో వ్యాపార లావాదేవీలు శనివారం నుంచి ఆరంభమయ్యాయి. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో పండ్ల మార్కెట్‌యార్డును ఐదు మాసాల అనంతరం శుక్రవారం గేట్లు తెరిచి మార్కెట్ యార్డులోకి సరుకును అనుమతించారు. శనివారం ఉదయం సరుకును వేలం వేసి ఎగుమతి చేశారు.