మేడ్చల్, మార్చి 5(నమస్తే తెలంగాణ): పచ్చదనం పెంపునకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారంలో ఈ ఏడాది మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 52 లక్షల 17 వేల 500ల మొక్కలను నాటేందుకు లక్ష్యంగా ప్రణాళిక సిద్ధమైంది. మున్సిపాలిటీల పరిధిలో 41 లక్షల, గ్రామీణ ప్రాంతాలలో 11 లక్షల మొక్కలను నాటేలా లక్ష్యం పెట్టుకున్నారు. అవసరమైతే మొక్కలు నాటే సంఖ్యను పెంచుతామని అధికారులు తెలిపారు. ప్రభుత్వ స్థలాలు ఖాళీగా ఉండకుండా మొక్కలు నాటేలా చూస్తున్నారు. ఇందు కోసం నర్సరీలలో మొక్కలను సిద్ధం చేస్తున్నారు.
దత్తత తీసుకున్నవారిని ప్రోత్సహిస్తాం
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో హరితహారం కార్యక్రమానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మున్సిపాలిటీ, గ్రామీణ ప్రాంతాలలో 52 లక్షల 17వేల 500ల మొక్కలు నాటే లక్ష్యం పెట్టుకున్నాం. మొక్కల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారాన్ని విజయవంతం చేసేలా అధికారులు కృషి చేస్తున్నారు. మొక్కలు పెంచేందుకు దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చిన వారికి ప్రోత్సహిస్తాం. జిల్లాలో మరిన్ని పార్కుల ఏర్పాటుకు కృషి చేస్తాం.
– మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్