దశలవారీగా మంచినీటి, డ్రైనేజీ సమస్యలు పరిష్కారం
ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి
చర్లపల్లి, మార్చి 2 : ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో నెలకొన్న మంచినీటి, డ్రైనేజీ సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. చర్లపల్లి డివిజన్, కుషాయిగూడ శివసాయినగర్ ఫేజ్-3 కాలనీవాసులు కాలనీలో మంచినీటి పైప్‌లైన్, రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని పలు కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి.. నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. శివసాయినగర్‌లో నెలకొన్న మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు నూతన పైప్‌లైన్, డ్రైనేజీ, రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా కాలనీలోని నాలాపై స్థానికులు రాకపోకలు సాగించేందుకు బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టి.. సకాలంలో పూర్తి చేశామని, నాలాకు ఆనుకొని ఉన్న జేకే నగర్ కాలనీవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం కాలనీవాసులు ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ధన్‌పాల్‌రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు డప్పు గిరిబాబు, నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపెల్లి పద్మారెడ్డి, కర్రె సత్య నారాయణ, రెడ్డినాయక్, చల్లా వెంకటేశ్, కాలనీ సంఘం నాయకులు విజయ, మాధవి, సత్యంయాదవ్, మాధవి, అరుణ, సుజాత, రాజేశ్వరి, కృష్ణవేణి, బంగారి, చిరంజీవి, రాము తదితరులు పాల్గొన్నారు.