కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 26 : అక్షయ పాత్ర ఫౌండేషన్ సేవలు అభినందనీయమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శనివారం కుత్బుల్లాపూర్ గణేశ్‌నగర్ అమృతాలయం దేవస్థానంలో గ్రీన్ మెట్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహకారంతో అక్షయపాత్ర ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన ఉచిత కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ సెంటర్‌ను ఆయన ప్రా రంభించారు. 15 ఏండ్లు పైబడినవారందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. అనంతరం వెయ్యిమందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీశ్, బొడ్డు వెంకటేశ్వర్రావు, మాజీ కౌన్సిలర్ సూర్యప్రభ, దుర్గారావు, నర్సింహారెడ్డి, యాదగిరి, లింగం, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నా రు. అనంతరం గణేశ్‌నగర్‌లో నాలా కల్వర్టు నిర్మాణ పనులను పరిశీలించి.. నూతనంగా చేపట్టాల్సిన రిటైనింగ్ వాల్, భూగర్భ డ్రైనేజీ, సీసీరోడ్డు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.