చర్లపల్లి, ఫిబ్రవరి 26 : ఔషధ మొక్కలు నాటి.. వాటి సంరక్షణకు కాలనీవాసులు ముందుకురావడం హర్షణీయమని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని రామకృష్ణానగర్‌లో కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 500 ఔషధ మొక్కలను ఎమ్మెల్యే.. కాలనీవాసులతో కలిసి నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ప్రతి ఒక్కరూ ఔషధ మొక్కలు నాటడంతో పాటు తమ పరిసరాల ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. హరితహారం కార్యక్రమం లో భాగంగా ఇప్పటికే నియోజకవర్గపరిధిలోని పలు కాలనీలు, ఖాళీ స్థలాల్లో వేలాది మొక్కలునాటి.. వాటి సంరక్షణకు చర్యలు తీసుకున్నా మని, కాలనీవాసులు మొక్కలునాటి వాటి సంరక్షణకు ముందుకురావడం అభినందనీయమన్నారు. అనంతరం కాలనీవాసులు ఎమ్మెల్యేను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సెక్టార్ ఎస్సై సాయికుమార్, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రాంప్రసాద్, అంకాల రమేశ్, కాలనీ నాయకులు దేవరాజ్, నవీన్, వాడపల్లి రమేశ్, రంగారావు, మోహన్‌లాల్, ప్రసాద్, రాజు, మల్లికార్జున్, అనిల్‌రెడ్డి, భాస్కర్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు డప్పు గిరిబాబు, నాయకులు పద్మారెడ్డి, జనుంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, రెడ్డినాయక్, నందకిశోర్, అంజయ్య, సోమయ్య, సుభాశ్, గరిక సుధాకర్, రాధాకృష్ణ, గణేశ్ పాల్గొన్నారు.