సికింద్రాబాద్/మారేడ్‌పల్లి, ఫిబ్రవరి 26: ప్రజల ఆశ్వీరాదం నిరంతరం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. నియోజకవర్గంలోని మారేడ్‌పల్లి కోర్టు లైన్లో సుమారు రూ.91లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, ఫుట్‌పాత్ నిర్మాణంతో పాటు రసూల్‌పురాలోని 105 గల్లీలో సుమారు రూ.15లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సాయన్న శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ.. త్వరలోనే నారాయణ జోపిడి సంఘం బస్తీలో డబుల్ ఇండ్ల నిర్మా ణ పనులు ప్రారం భం కానున్నాయని తెలిపారు. పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు నళినికిరణ్, ప్రభాకర్, నేతలు నివేదిత, టీఎన్ శ్రీనివాస్, కుమార్ ముదిరాజ్, దేవులపల్లి శ్రీనివాస్, గౌస్, వాహెబ్, నయీమ్, నర్సింహ, ఆంజనేయులు, శ్రీను, నగేష్, భాస్కర్ పాల్గొన్నారు.
లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు
లక్షల రూపాయాల వ్యయంతో పలు బస్తీ, కాలనీల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న అన్నారు. శనివారం మోండా డివిజన్ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీసీ, వీడీసీసీ రోడ్లు ఏర్పాట్లు, తాగునీరు, డ్రైనేజీ నూతన పైప్లైన్లు, పార్కు ల అభివృద్ధి తదితర మౌలిక వసతులను అభివృద్ధి చేపట్టడం జరిగిందన్నారు. అదేవిధంగా మారేడ్‌పల్లి నెహ్రూనగర్ పార్కు ఆవరణలో కోట్ల రూపాయాల వ్యయంతో మల్టీపర్పస్ కమ్యూనిటీహాల్‌ను ఏర్పాటు చేశామని, ఇటీవల ప్రజలకు ఉపయోగంలోకి తీసుకొచ్చినట్లు తెలిపా రు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొంతం దీపిక ,జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ జోనల్ కమిషనర్ ముకుందరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సుదర్శన్, డీఈ ఆంజనేయులు, ఏఈ రవీందర్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.