ఖైరతాబాద్ యూపీహెచ్సీ పరిధిలో కేంద్రాలు
ఖైరతాబాద్ యూపీహెచ్సీ పరిధిలో 17 కేంద్రాల్లో పల్స్‌పోలియో నిర్వహిస్తున్నారు. బడా గణేశ్ చౌరస్తా, వెల్నెస్ సెటర్, నిషూల్క్ ప్రభాత్ హైస్కూల్, వాసవీ ప్రభుత్వ ప్రాక్టీసింగ్ స్కూల్, మహాభారత్‌నగర్ కమ్యూనిటీ హాల్, బిర్లా మందిర్, గన్‌ఫౌండ్రీ కమ్యూనిటీ హాల్, ఇందిరానగర్, సంజయ్‌గాంధీనగర్, గాంధీనగర్ కమ్యూనిటీ హాళ్లు, నెహ్రూనగర్, భారతీయ విద్యాభవన్, లుథరన్ చర్చి, పూల్‌బాగ్, కిర్లోస్కర్ దవాఖాన, బీజేఆర్ కమ్యూనిటీ హాల్, హోప్ దవాఖానలో చుక్కల మందు వేస్తారు.
హైరిస్క్ ప్రాంతాలపై దృష్టి
భవన నిర్మాణాలు, వలస కార్మికులు నివసించే బస్తీలు, గూడారాల్లోని పిల్లలకు పోలియో చుక్కలు వేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఆయా ప్రాంతాల్లో నిరక్షరాస్యత కారణంగా చాలా మంది చుక్కల మందుకు దూరంగా ఉంటారు. అలాంటి ప్రాంతాలను హైరిస్క్ జోన్లుగా గుర్తించి పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రెండు మొబైల్ వాహనాలను ఏర్పాటు చేశాం. ఇప్పటికే ఆశవర్కర్లు, సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. నేడు చుక్కల మందు వేసుకోని వారి కోసం రేపు, ఎల్లుండి ఇంటింటికీ వెళ్లి లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. ప్రజలందరూ 0-5 లోపు పిల్లలకు భవిష్యత్‌లో అనారోగ్యసమస్యలు, వైకల్యం కలుగకుండా ఉండాలంటే తప్పని సరిగా పోలియో చుక్కలు వేయించాలి.
– డాక్టర్ సువర్ణ, వైద్యాధికారి, ఖైరతాబాద్ యూపీహెచ్సీ
హిమాయత్‌నగర్ డివిజన్లో..
గాంధీకుటీర్,కేశవ మెమోరియల్, త్తానగర్,ఆదర్శబస్తీ,విఠల్వాడి, రాజమోహల్లాబస్తీ, శంషీర్బాగ్, ముత్యాలబాగ్ బస్తీ దవాఖాన,ఓల్డ్ కమేలా, చంద్రానగర్, బగ్గీఖాన, వెంకట్స్వామినగర్, కింగ్‌కోఠి,బొగ్గులకుంట,పర్ధాగేట్,షేర్ఘాట్, కింగ్‌కోఠిలో పోలియో కేంద్రాల్లో పోలియో చుక్కలు వేయనున్నారు. ఈ కేంద్రాల పరిధిలో ఐదేండ్లలోపు చిన్నారులు 5,402 మంది ఉండగా చ200 వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంచారు. ఒక మొబైల్ టీం, ఇద్దరు డాక్టర్స్, స్టాఫ్ నర్సులు 15,ఏఎన్ఎంలు 16,అంగన్వాడీ టీచర్ల్లు 05,ఆశవర్కర్లు 16 మంది పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొంటారు.