మియాపూర్ , ఫిబ్రవరి 26: నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ తెలిపారు. కూకట్పల్లి డివిజన్ పరిధిలోని దీనబంధు, ప్రగతీనగర్, ఆస్బెస్టాస్ కాలనీ, పాపిరెడ్డి నగర్, పాపారాయుడు కాలనీల్లో రూ. కోటితో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, నార్నె శ్రీనివాసరావుతో కలిసి విప్ గాంధీ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజవకర్గంలో యూజీడీ పనులను పూర్తి చేసిన కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. అభివృద్ధి పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గాంధీ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, భా స్కర్, చంద్రకాంత్‌రావు,చంద్రారెడ్డి, నాగేశ్వర్రావు, ఇబ్ర హీం, నాయుడు, శ్రీధర్‌రెడ్డి, అబ్బులు, ఖయ్యూం, ప్రసాద్, శెట్టి, అంజి, సత్తయ్య, విఠల్, తిరుపతి, మహేశ్,ఎర్రన్న , భాస్కర్, పద్మశ్రీ , జ్యోతి, సువర్ణ, కవిత, లావణ్య పాల్గొన్నారు.
కొండాపూర్ డివిజన్ సిద్ధిక్ నగర్‌కు చెందిన ప్రభుదాస్‌కు సీఎం సహాయ నిధి కింద మంజూరైన రూ. 2 లక్షల ఆర్థిక ఎల్వోసీ పత్రాలను, కూకట్పల్లి డివిజన్ ఆస్బెస్టాస్ కాలనీకి చెందిన శ్రీనివాసప్రసాద్‌కు మంజూరైన రూ. 2.50లక్షల చెక్కును కార్పొరేటర్లు శ్రీనివాసరావు, సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ సాయిబాబాతో కలిసి ఎమ్మెల్యే వారికి అందజేశారు.
గచ్చిబౌలి డివిజన్ నానక్‌రామ్ గూడలో నెలకొన్న పలు సమస్యలతో పాటు చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై మాజీ కార్పొరేటర్ సాయిబాబా ఆధ్వర్యంలో కాలనీ వాసులు విప్ గాంధీని ఆయన నివాసంలో శనివారం కలిసి వినతి పత్రం సమర్పించారు.