చిక్కడపల్లి, ఫిబ్రవరి 26 : ప్రజల సమస్యలు తెలసుకోవడానికి చెపట్టిన బస్తీ బాట కార్యక్రమంలో ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. శనివారం బాగ్‌లింగంపల్లి లోని అచ్చయ్య నగర్, ఈడబ్ల్యుఎస్ క్వాటర్టర్స్, బృందావన్ కాలనీ తదితర బస్తీల్లో బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే బస్తీల్లో పర్యటించి ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకుని సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అచ్చయ్యనగర్‌లో డ్రైనేజీ సమస్య, పోలీస్ పె ట్రోలింగ్ ఏర్పాటు చేయాలని తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. అవసరం ఉన్న చోట నూతన మంచినీటి, డ్రైనేజీ పైపులైన్ల నిర్మాణం చేపడుతామని అన్నారు. ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, బాగ్‌లింగంపల్లి వాటర్‌వర్క్స్ మేనేజర్ జీవన జ్యోతి, ఏఈ మురళి, డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రావులపాటి మోజస్, మన్నె దామోదర్‌రెడ్డి, వెంకటకృష్ణ(బబ్లు), హౌస్‌ఫెడ్ డైరెక్టర్ ఎ. కిషన్‌రావు, నాగభూషణం, రాజేంద్ర ప్రసాద్గౌ డ్, సిరిగి కిరణ్‌కుమార్, జనార్దన్, శివకుమార్ యాదవ్, కల్యాణ్‌నాయక్, ఎంవి. జనార్దన్, కూరగాయల శ్రీను, టీవీ రాజు, సత్యనారాయణ, అచ్చయ్యనగర్ బస్తీ నాయకుడు వెంకట్స్వామిగౌడ్, సత్తయ్యగౌడ్ పాల్గొన్నారు.