దుండిగల్, ఫిబ్రవరి 22: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని, అందులో భాగంగానే నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు రూ.22.59 కోట్ల ఎస్ఎన్డీపీ నిధులతో వరదనీటి నాలా నిర్మాణ పనులు చేపడుతున్నామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, బాలాజీనగర్ కమాన్ వద్ద రూ.13.04 కోట్లతో ఆచార్యకుంట నుంచి బాటా జంక్షన్, బాలాజీ కాలనీ నుంచి బాటా జంక్షన్ వరకు, బాటా జంక్షన్ నుంచి బాలాజీ టవర్స్ వరకు, అదే విధంగా మరో రూ.9.55 కోట్లతో బండారి లే అవుట్ రోడ్డు నంబర్-3 కమ్యూనిటీ హాల్ వద్ద, బండారి లే అవుట్ నుంచి సాయి భాస్కర్ నెస్ట్, పాపయ్యకుంట నుంచి బాలాజీ టవర్స్ వరకు నిర్మించే వర్షపునీటి కాలువ పనులకు మంగ ళవారం మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడు తూ.. గతంలో కురిసిన భారీ వర్షాలతో వరదనీరు ఇండ్ల మధ్య నిలువ డంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారని, ఇక నుంచి అలాంటి సమస్య తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపుతున్నామని తెలిపారు.
భవిష్యత్‌లో జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని.. ఇప్పటి నుంచే ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. మంత్రి కేటీఆర్ సహకారంతో ట్రాఫిక్ నియంత్రణ కోసం రోడ్డు వెడల్పు, ఫ్లైఓవర్ల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి పనులు చేపడుతు న్నామన్నారు. కార్యక్రమంలో నిజాంపేట కార్పొరేషన్ కమిషనర్ శంకర య్య, డిప్యూటీ మేయర్ ధన్రాజు, ఎస్ఈ శంకర్‌లాల్, ఎస్ఎన్డీపీ డీఈ నరేందర్, ఏఈలు విశ్వం, రామారావు, కార్పొరేటర్లు కొలన్ వీరేందర్‌రెడ్డి, వాకలపూడి రవికిరణ్, ఏనుగుల అభిషేక్‌రెడ్డి, బొర్ర దేవీ చందు ముదిరా జు, జ్యోతిరెడ్డి, విజయలక్ష్మి, సుజాత, ప్రణయ, ఆవులపావణి, రజిత రవికాంత్, రాజేశ్వరీ, కో-ఆప్షన్ సభ్యులు అభిషేక్ రెడ్డి, వీరేశ్, వాణి, సీనియర్ టీఆర్ఎస్ నాయకులు కొలన్ గోపాల్‌రెడ్డి, నిజాంపేట కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రంగరాయప్రసాద్తో పాటు పెద్దసంఖ్యలో నేతలు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.