బండ్లగూడ, ఫిబ్రవరి 22: దళితుల సాధికారత కోసం ప్రభుత్వం దళితబంధు రూపొందించిందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అన్నారు. శంషాబాద్ మండలంలోని దళితబంధు లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితులందరూ అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ పథకంలో భాగంగా అర్హూలైన దళితులందరికీ రూ.10లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో చంద్రకళ, తాసీల్దార్ జనార్దనరావు, జడ్పీటీసీ తన్వీరాజ్, ఎంపీపీ జయమ్మాశ్రీనివాస్, మండలపార్టీ అధ్యక్షులు చంద్రారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
దళితుల సంక్షేమం కోసమే..
దళితుల సంక్షేమం కోసమే దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన్నట్లు రాజేంద్రగనర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ అన్నారు. మంగళవారం రాజేంద్రనగర్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో శంషాబాద్ మండలంలోని ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని దళితుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన్నట్లు వివరించారు. శంషాబాద్ మండలంలో 100 మందికి దళిత బంధు పథకాన్ని మంజూరు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సమావేశంలో రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ, పార్టీ మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోహన్‌రావు, ఎంపీపీ జయమ్మ, జడ్పీటీసీ తన్విరాజు, వైస్ ఎంపీపీ నీలంనాయక్, పరిశ్రామలశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నరు.
పేదల ఆపన్నహస్తం..
మణికొండ, ఫిబ్రవరి 22: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరంలాంటిదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ పేర్కొన్నారు. నార్సింగి గ్రామానికి చెందిన యాదయ్యకు మంజూరైన రూ.1.50వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మంగళవారం స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ రేఖాయాదగిరి, వైస్ చైర్మన్ వెంకటేశ్‌యాదవ్ అందజేశారు.
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం..
వ్యవసాయ యూనివర్సిటీ, ఫిబ్రవరి 22: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం తన కార్యాలయంలో బాధితుడు చింతల్‌మెట్‌కు చెందిన విష్ణుకు రూ.2లక్షల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సులేమాన్‌నగర్ డివిజన్ అధ్యక్షుడు షేక్ నయీముద్దీన్, షేక్‌బాబా, హుస్సేన్, ఫయాజ్‌ఖాన్, విష్ణు, తదితరులు పాల్గొన్నారు.
మంచిరేవుల మల్లన్న జాతరలో..
అన్నివర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అన్నారు. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవుల గ్రామంలో రెండురోజులుగా జరుగుతున్న మల్లన్న, ఎల్లమ్మజాతర మహోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. కురమ, గొల్లల సంక్షేమంతో పాటు అన్నివర్గాల సంక్షేమానికి టీఆర్ఎస్ సర్కారు కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రేఖ, వైస్ చైర్మన్ వెంకటేశ్‌యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్‌గౌడ్, వైస్ చైర్మన్ ప్రవీన్యాదవ్, పార్టీ అధ్యక్షుడు నర్సింహ, మాజీ వైస్ ఎంపీపీ పాపిరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ రమేశ్, నాయకులు సాయికుమార్, కురుమగొల్ల కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌యాదవ్, వైస్ చైర్మన్ భాస్కర్, నాయకులు శ్రీనివాస్, విష్ణువర్ధన్‌రెడ్డి, లక్ష్మణ్, మహేశ్, తదితరులు పాల్గొన్నారు.
డ్రైనేజీ పైపులైన్ పనులకు శంకుస్థాపన..
మైలార్‌దేవ్‌పల్లి డివిజన్లోని అన్ని కాలనీల్లో డ్రైనేజీ శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తెలిపారు. సోమవారం గగన్‌పహాడ్ బస్తీలో రూ.44.90లక్షలతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు జలమండలి అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ అభివృద్ధి కోసం అనేక నిధులు మంజూరు చేయిస్తున్నానని అన్నారు. వర్షాకాలంలో గగన్‌పహాడ్ ప్రజలు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. దానిని దృష్టిలో పెట్టుకోని అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పటిష్టంగా ఉండటానికి ప్రత్యేక నిధులు మంజురు చేయించి పనులు చేయిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి, జలమండలి డిప్యూటీ జనరల్ మేనేజర్ అబ్దుల్ సత్తార్, మాజీ డివిజన్ అధ్యక్షుడు సరకొండ వెంకటేశ్, దుర్గేశ్, సత్తిగౌడ్, రాజుగౌడ్, అశోక్, దత్తు, రాఘవేందర్, వెంకటేశ్, నర్సింహ, తదితరులు పాల్గొన్నారు.