శంషాబాద్ రూరల్, డిసెంబర్ 5: భూసార పరీక్షలు చేయడంతో రైతులకు ఎంతో మేలు జరుగుతున్నదని రంగారెడ్డి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ బురుకంట సతీశ్ అన్నా రు. సోమవారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో మండలంలోని మల్కారం, హమిదుల్లానగర్ గ్రామాల్లోని రైతు వేదికల్లో నేల(అంతర్జాతీయ) దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సతీశ్ హాజరై మాట్లాడుతూ మండలంలోని ప్రతి రైతు తన పొలంలో మట్టితో భూసార పరీక్షలు చేసుకోవడంతో పాటు కార్డులను తీసుకోవాలని సూచించారు. భూసార పరీక్షలు చేసిన ఫలితాలను సదరు రైతులకు నేరుగా వివరించాలన్నారు. సేంద్రి య ఎరువులు వీలైనంత ఎక్కవగా రైతులు ఉపయోగించాలన్నారు. నేలను కాపడితేనే రేపటి తరాలకు భవిష్యత్తు ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేతలు మాధవి, జయశ్రీ, మండల వ్యవసాయ అధికారి కవిత, పశుసంవర్థకశాఖ అధికారులు సంపత్, దానయ్య, టీఆర్ఎస్ రైతు విభాగం అధ్యక్షుడు యాదగిరిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.
ఖానాపూర్‌లో..
మణికొండ,డిసెంబర్5: నార్సింగి మున్సిపాలిటీ ఖానాపూర్ 12వ వార్డులోని రైతువేదిక కేంద్రంలో ప్రపంచ నేల(మృతిక) దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్మండల వ్యవసాయ అధికారి మల్లారెడ్డి మాట్లాడుతూ రైతులు తమనేల పరిస్థితిని ఆరోగ్యాన్ని తెలుసుకోవడం గురించి మట్టి పరీక్షలు చేయించుకుని వాటి ఫలితాల ఆధారంగా ఎరువుల యాజమాన్యం పాటించాలని సూచించారు. భవిష్యత్తు తరాల కోసం నేల సారాన్ని కాపాడాలని కోరారు. అధిక రసాయనిక ఎరువులను, పురుగు మందులను వాడరాదని రైతులకు సూచించారు. సాధ్యమైనంత వరకు సేంద్రియ పద్ధ్దతులను పాటించాలని కోరారు. అనంతరం చైతన్యభారతీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు భూమిప్రత్యేకతలను గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ అమరేందర్‌రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీనివాస్‌గౌడ్,సీబీఐటీ ప్రొఫెసర్ పూర్ణచంద్రిక, రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్ కృష్ణ, సహకారసంఘ డైరెక్టర్లు భిక్షపతి, రామకృష్ణారెడ్డి, రైతులు భూపాల్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, శంకర్ సురేశ్, శ్రీకాంత్‌రెడ్డి, తారాసింగ్,మంగళి మాణిక్యం, తదితరులు పాల్గొన్నారు.