ఆలయాల అభివృద్ధికి పెద్దపీట
ఆలయాల ప్రాశస్త్యం నలుదిశలా వ్యాపింపజేందుకు జరుగుతున్న కృషి భాగంగా దాతల చేయూత ఎంతో అవసరమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు.
- మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
- దాతల సహకారానికి అభినందనలు
- హనుమాన్ ఆలయ ముఖద్వారానికి శంకుస్థాపన
అమీర్‌పేట్, డిసెంబర్ 3 : ఆలయాల ప్రాశస్త్యం నలుదిశలా వ్యాపింపజేందుకు జరుగుతున్న కృషి భాగంగా దాతల చేయూత ఎంతో అవసరమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. సనత్‌నగర్ హనుమాన్ దేవాలయ ఆవరణలోని ఆలయాల విశేషాల గురించి ప్రజలకు తెలిసేలా చేస్తుండటంతో ఆయా ఆలయాల ముఖద్వారాల పాత్ర ఎంతో ఉంటుందన్నారు. భక్తుల కోరిక మేరకు సరిగ్గా అటువంటి ముఖద్వారమే సనత్‌నగర్ హనుమాన్ దేవాలయానికి దారి చూపే మార్గంలో ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ ఎదురుగా జెక్కాలనీ నిర్మించ తలపెట్టి శనివారం ఉదయం కార్పొరేటర్ కొలను లక్ష్మీరెడ్డితో కలిసి మంత్రి తలసాని నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇదిలా ఉంటే జెక్కాలనీ గాంధీ విగ్రహం సమీపం నుంచి సనత్‌నగర్ ఎస్ఆర్టీ హనుమాన్ దేవాలయ మార్గంలో కూడా గ్రీన్ సిటీ అధినేత కొండ్రాజు సుబ్బరాజు ఇప్పటికే ఆర్చి నిర్మించేందుకు ముందుకు వచ్చారు. కాగా తాజాగా శంకుస్థాపన చేసిన పనులకు కూడా తన వంతు చేయూతనందించడం అభినందించదగ్గ విషయమని మంత్రి తలసాని అన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కొలను లక్ష్మీరెడ్డి రూ. 2 లక్షలు, కాలనీ నివాసితులు తమ వంతు చేయూతగా ఆర్థిక సహకారాన్ని ప్రకటించారు. కార్యక్రమంలో దాతలు సురేశ్ చౌదరి, శ్రీహరి, బుచ్చిబాబులతో పాటు నాయకులు సంతోష్ సరఫ్ పాల్గొన్నారు.
అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి…
బేగంపేట్ డిసెంబర్ 3: రాంగోపాల్‌పేట్ డివిజన్లోని ఆవులమందలో ఉన్న శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయ అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హామీ ఇచ్చారు. శనివారం ఆలయ పునర్నిర్మాణ పూజలలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ పనులు అభివృద్ధి గురించి నిర్వాహకులు మంత్రికి వివరించారు. మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్,మల్లికార్జున్‌గౌడ్, తలసాని సాయికిరణ్‌యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు బాలేందర్, వెంకటేశ్వర్లు, శరత్‌బాబు, దీపక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

