మారేడ్పల్లి, నవంబర్ 23 : సికింద్రాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యాలయంలో డివిజన్ జాయింట్ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరిగింది. డివిజన్ అధ్యక్షుడు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్.శంకర్రావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ పెన్షన్ పథకాన్ని రద్దు చేయడం, ఖాళీల భర్తీ మొదలైన అన్ని డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా వివిధ వర్గాల ఇతర డిమాండ్లపై కూడా చర్చించారు. ఈ సమావేశంలో 31 బ్రాంచ్ల నుంచి 500 మంది ఆఫీస్ బేరర్స్, మజ్దూన్ యూనియన్ ఏజీఎస్ ఉదయభాస్కర్, నాయకులు వరప్రసాద్, సరోజినీ రెడ్డి, మురళీధరన్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.