ఘట్కేసర్ రూరల్, నవంబర్ 19 : ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని స్వచ్ఛ్ భారత్ మిషన్ డైరెక్టర్ సురేశ్‌బాబు తెలిపారు. ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం సందర్భంగా మండల పరిధి కాచవానిసింగారం గ్రామంలో శనివారం జరిగిన స్వచ్ఛతా రన్ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీతో కలిసి పాల్గొన్నారు. పంచాయతీ పరిధిలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం నుంచి ముత్వెల్లిగూడలోని స్వామి వివేకానంద విగ్రహం వరకు పరుగెత్తారు. ఈ రన్ కార్యక్రమంలో విద్యార్థులు, డ్వాక్రా మహిళలు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ బహిరంగ మల విసర్జన చేయకుండా మరుగుదొడ్లను వినియోగించాలని సూచించారు. 90 వాతం మందికి మరుగుదొడ్లు ఉన్నాయని, మిగతా వారు సైతం మరుగుదొడ్లను వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకట్‌రెడ్డి, కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి, ఉప సర్పంచ్ గీతాముత్యం, ఏపీఎం తౌర్యానాయక్, వార్డు సభ్యులు విష్ణుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఆధునిక సౌకర్యాలతో ప్రజా మరుగుదొడ్లు పోచారం చైర్మన్ బి.కొండల్‌రెడ్డి
ఘట్కేసర్, నవంబర్ 19 : ఆధునిక సౌకర్యాలతో ప్రజా మరుగుదొడ్లను అందుబాటులోకి తీసుక వచ్చినట్లు పోచారం చైర్మన్ బి.కొండల్‌రెడ్డి తెలిపారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఆయన మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడలో ఎన్టీపీసీ రోడ్డు, సంస్కృతి టౌన్షిప్ రోడ్డు ప్రాంతాల్లోని ప్రజా మరుగుదొడ్లను కమిషనర్ సురేశ్‌తో కలిసి పరిశీలించారు. మున్సిపాలిటీ నిర్వహణలో ఉన్న ఈ మరుగుదొడ్లు ప్రజలకు ఉపయోగపడుతున్న తీరు, కావాల్సిన సదుపాయాలు వంటివి ఆయన పరిశీలించారు. మున్సిపాలిటీల ఆధ్వర్యంలో ముఖ్య చౌరస్తాల్లో ఏర్పాటు చేసి వాటి నిర్వహణ బాధ్యతలు సైతం చూస్తుందన్నారు. ఇక్కడి ఎన్టీపీసీ రోడ్డు, సంస్కృతి టౌన్షిప్ రోడ్డులోని ప్రజా మరుగుదొడ్ల వద్ద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రెడ్యా నాయక్, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.
కీసరలో…
కీసర, నవంబర్ 19 : ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా మండలంలోని పలు పంచాయతీల్లో స్వచ్ఛత రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీవో రమాదేవి, ఎంపీవో మంగతాయారు, మండలంలోని పలు పంచాయతీలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ సభ్యులు స్థానికంగా ఉన్న విద్యార్థులతో కలిసి స్వచ్ఛతా రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. మండలంలోని ప్రతి గ్రామంలోని ఇండ్లలో వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు నాయకపు మాధురి వెంకటేశ్, సుంకరి కవితాజైహింద్రెడ్డి, గరుగుల ఆండాళ్మల్లేశ్, ఆకిటి మహేందర్‌రెడ్డి, మోర విమలానాగరాజు, సత్తమ్మ, పుట్ట రాజుముదిరాజ్, తుంగ ధర్మేందర్, పిడిచుట్టి పెంటయ్య, కౌకుట్ల గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
మేడ్చల్ రూరల్‌లో…
మేడ్చల్ రూరల్, నవంబర్ 19 : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ మరుగుదొడ్లను ఉపయోగించాలని గౌడవెల్లి గ్రామ సర్పంచ్ సురేందర్ ముదిరాజ్ అన్నారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా శనివారం మేడ్చల్ మండలంలోని గౌడవెల్లి గ్రామంలో విద్యార్థులతో స్వచ్ఛతా రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.