కాప్రా, నవంబర్ 17: కాప్రా డివిజన్లో ఈ ఆర్థిక సంవత్సరంలో (2022-2023) రూ.9.8 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వీ టిలో గత ఏడాదికి సంబంధించి రూ.8.14కోట్లతో చేపట్టిన 22 స్పిల్ ఓవర్ పనులు, ఈ ఏడాది మంజూరైన రూ.1.66కోట్లతో చేపట్టిన 14 పనులు .. మొత్తం రూ.9.8 కోట్లతో 36 రకాల అభివృద్ధి పనులు పారంభించారు. వీటిలో రూ.1.95 కోట్లతో చేపట్టిన 17 అభివృద్ధి పనులను అక్టోబర్ ఆఖరు వరకు పూర్తి చేయగా, రూ.3.65 కోట్లతో చేపట్టిన 9 అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. రూ.4.17 కోట్లతో చేపట్టే 8 అభివృద్ధి పనులను ప్రారంభించాల్సి ఉంది. రూ.3.5లక్షలతో చేపట్టాల్సిన ఓ పనిని రద్దు చేశారు.
డ్రైన్లు, అంతర్గత రోడ్లకే అత్యధిక నిధులు..
కాప్రా డివిజన్లో డ్రైన్లు, అంతర్గత రోడ్ల నిర్మాణం కోసమే ఎక్కువ నిధులు కేటాయించినట్లు అధికారుల అందించిన వివరాలను బట్టి తెలుస్తోంది. డివిజన్లో స్టార్మ్‌వాటర్ డ్రైన్ల నిర్మాణం కోసం రూ. 4.04కోట్లు కేటాయించి మంజూరు చేయగా.. వీటిలో రూ.1.89 కోట్లతో రెండు స్టార్మ్‌వాటర్ డ్రైన్ల నిర్మాణ పనులు కొనసాగుతుండగా, రూ.2.16 కోట్లతో మరో రెండు నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది.
4 అంతర్గత బీటీ రోడ్ల నిర్మాణం కోసం రూ.1.74కోట్లు, 2 అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ.28లక్షలు మంజూరు కాగా వీటిలో ఇప్పటి వరకు రూ.10.20లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పని పూర్తి అయింది. రూ.17. 80 లక్షలతో చేపట్టాల్సిన ఓ సీసీ రోడ్డు పని ఇంకా కొనసాగుతున్నది. నాలాల డీసీల్టింగ్ పనుల కోసం రూ. 32లక్షలు కేటాయించగా ప్రస్తుతం ఆ పనులు కొనసాగుతున్నాయి. రూ.34.50లక్షలతో శ్మశానవాటిక పనులు చేపట్టాల్సి ఉండగా ఆ పనులను ఇంకా చేపట్టలేదు. రెండు కమ్యూనిటీ హాళ్లు నిర్మించేందుకు రూ.32లక్షలు మంజూరు కాగా వాటిలో రూ.9.95 లక్షలతో నిర్మించే ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి కాగా, రూ.22 లక్షలతో చేపట్టాల్సిన కమ్యూనిటీహాల్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి.
డివిజన్ సమగ్రాభివృద్ధికి కృషి..
కాప్రా డివిజన్‌ను అభివృద్ధిలోనూ నంబర్ వన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నా. గత ఏడాదికి సంబంధించిన పనులతో పాటు ఈ ఏడాది మంజూరైన పనులతో కలిపి డివిజన్లో రూ.9.8 కోట్లతో 36 రకాల అభివృద్ధి పనులు చేపట్టగా, సుమారు రూ.2 కోట్లతో చేపట్టిన పనులు పూర్తి అయ్యాయి. రూ.3.65 కోట్ల పనులు కొనసాగుతున్నాయి. కాలనీల్లో బీటీ, సీసీ రోడ్ల పనులు చేపట్టాం. డ్రైన్ల నిర్మాణం, నాలాల పూడికతీత పనులు యథాప్రకారం జరుగుతున్నాయి. – స్వర్ణరాజు శివమణి, కార్పొరేటర్