సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): టీ హబ్‌లోని స్టార్టప్‌లకు కార్పొరేట్ సంస్థల నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందుతున్నదని టీ హబ్ సీఈఓ ఎం.ఎస్.రావు అన్నారు. ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ స్విస్ రే ప్రతినిధులతో టీ హబ్ కేంద్రంగా ఇటీవల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు హెచ్ఆర్( మానవవనరులు) టెక్ అంశంలో తమతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిని వ్యక్తం చేశారని ఎం.ఎస్.రావు తెలిపారు. ప్రజల్లో ఆవిష్కరణల పట్ల ఉన్న ఆసక్తిని ప్రోత్సహించడమే లక్ష్యంగా టీ హబ్, స్విస్ రే సంస్థలు సంయుక్తంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టాయని చెప్పారు. ఒకవైపు స్టార్టప్‌ల ప్రోత్సహించే కార్యక్రమాలు చేపడుతూనే, మరో వైపు కార్పొరేట్ సంస్థల నుంచి స్టార్టప్‌లకు సహకారం అందేలా టీ హబ్ నిరంతరం పనిచేస్తున్నదని పేర్కొన్నారు.