చర్లపల్లి, నవంబర్ 9 : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్‌లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. చర్లపల్లి డివిజన్ పారిశ్రామికవాడ ఆడిటోరియంలో కాప్రా ప్రెస్‌క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి కార్పొరేటర్లు శిరీషాసోమశేఖర్రెడ్డి, బొంతు శ్రీదేవి, జెర్రిపోతుల ప్రభుదాస్, పన్నాల దేవేందర్‌రెడ్డి, శాంతి సాయిజెన్ శేఖర్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని జర్నలిస్ట్‌ల సంక్షేమానికి తనవంతు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే కాప్రా, ఉప్పల్ ప్రెస్‌క్లబ్ భవన నిర్మాణానికి తగు చర్యలు తీసుకున్నామని ఆయన గుర్తు చేశారు. సమస్యల పరిష్కారంలో కీలక భూమిక పోషిస్తున్న జర్నలిస్ట్‌లకు నాయకులు ఆండగా నిలువాలని, జర్నలిస్ట్‌ల సంక్షేమం కోసం ఆర్థిక సాయం అందజేయనున్నట్లు చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, జర్నలిస్ట్ నాయకులను, అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంబీసీ రాష్ట్ర చైర్మన్ తాడూరి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు పావనీమణిపాల్‌రెడ్డి, కొత్త రామారావు, సింగిరెడ్డి ధన్‌పాల్‌రెడ్డి, ఐలా చైర్మన్ రోషిరెడ్డి, సీఐఏ అధ్యక్షుడు గోవింద్‌రెడ్డి, టీయూడబూజర్నలిస్టుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి ్ల్యజే ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడు వెంకట్‌రెడ్డి.
ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి
మెరుగు చంద్రమోహన్, కాప్రా ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు అశోక్, బాల్‌రాజు, కోశాధికారి బాల్‌రెడ్డి, నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, గరిక సుధాకర్, సోమశేఖర్‌రెడ్డి, సాయిజెన్‌శేఖర్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు కాసం మహిపాల్‌రెడ్డి, డప్పు గిరిబాబు, మల్లేశ్ వంశరాజు, జాండ్ల ప్రభాకర్‌రెడ్డి, సారా అనిల్, కుమార్‌స్వామి, సత్యనారాయణ, పాత్రికేయులు సహదేవ్చారి, బెలిదే అశోక్, కేసీ.మోహన్, పద్మారెడ్డి, ఆదిమూలం శ్రీనివాస్, కీర్తి శ్రీనివాస్, ముత్యంరెడ్డి, రవీందర్‌రెడ్డి, రామతులసీ, మోహన్‌రెడ్డి, ఏనుగు సీతరామిరెడ్డి, సురేందర్, శివ, బాజీబాషా తదితరులు పాల్గొన్నారు.
ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం
రామంతాపూర్, నవంబర్ 9 : పేద ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. బుధవారం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన ఎల్ఓసీ చెక్కును ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి లబ్ధిదారులు జయదీప్రెడ్డికి రూ.2.50లక్షల అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఎంతో మంది పేదలు ఆరోగ్యవంతులవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గరిక సుధాకర్, డివిజన్ అధ్యక్షులు డాక్టర్ బీవీచారి, కంచర్ల సోమిరెడ్డి, రవీందర్‌రెడ్డి, నందికంటి శివ, శ్రీధర్, సూరం శంకర్ తదితరులు పాల్గొన్నారు.