ముషీరాబాద్/ కవాడిగూడ/చిక్కడపల్లి, నవంబర్ 6: మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలు పు బీజేపీ చేస్తున్న కుట్రలకు చెంపపెట్టు అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వాలు కూల్చే కుట్రలు చేస్తున్న బీజేపీకి ప్రజలు ఓటు ద్వారా గట్టి బుద్ధి చెప్పారని అన్నారు. ఆదివారం రాంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మునుగోడు ప్రజలు అభివృద్ధికి పట్టంకడుతూ కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చారని అన్నారు. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ ఏర్పాటుకు ఈ గెలుపు నాంది అని అన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు ఆదివారం ముషీరాబాద్ నియోజకవర్గం లో సంబురాలు జరుపుకున్నారు. బాణసంచా కాల్చుతూ మిఠాయిలు పంచి నృత్యాలు చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని రాంనగర్ చౌరస్తా, రాంనగర్ ఈ సేవా, ముషీరాబాద్, భోలక్‌పూర్, కవాడిగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్లలో టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నారు. రాంనగర్, ఈ సేవా వద్ద జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొని బాణసంచా కాల్చి, డోలు వాయిస్తూ కార్యకర్తలతో కలిసి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ముఠా జయసింహ, రామ్‌నగర్, అడిక్‌మెట్ డివిజన్ల అధ్యక్షులు రావులపాటి మోజ స్, బి.శ్రీనివాస్‌రెడ్డి, రవియాదవ్, నేత శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. అదేవిధంగా పార్శిగుట్ట చౌరస్తాలో టీఆర్ఎస్ నేత టీ సోమసుందర్ ఆధ్వర్యంలో సంబురాలు జరిగాయి.
కవాడిగూడలో.. మునుగోడులో టీఆర్ఎస్ బంపర్ మెజారిటీతో గెలిచిన సందర్భంగా ఆదివారం కవాడిగూడ, భోలక్‌పూర్ డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బ్యాండ్ మేళాలతో పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నారు. కవాడిగూడ డివిజన్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్ యాదవ్ ఆధ్వర్యంలో ఇందరాపార్కు, ముషీరాబాద్ చౌ రస్తాలలో సంబురాలు నిర్వహించారు. అదేవిధంగా భోలక్‌పూర్ డివిజన్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్‌రావు ఆ ధ్వర్యం లో నిర్వహించిన సంబురాలకు ఎమ్మెల్యే ముఠా గోపాల్, టీఆర్ఎస్ నాయకుడు ముఠా జయసింహ హాజరై బాణసంచా పేల్చి సంబురాలు జరిపారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి సంతోషం వ్యక్తం చేశారు. నాయకులు శంకర్ గౌడ్, నవీన్, గోవింద్రాజ్, సాయి, కల్యాణ్, భాస్కర్, లక్ష్మణ్, నరసింహ, భీమ్, ఉప్పలయ్య, ఉమాకాంత్, రాంచందర్, ప్రవీణ్, రాజశేఖర్‌గౌడ్, విశ్వనాథ్, మాధివి, మధు తదితరులు పాల్గొన్నారు.
మునుగోడు విజయాన్ని హర్షిస్తూ ఆదివారం తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో కవాడిగూడలో సీఎం కేసీఆర్ ప్లెక్సీ పెట్టి బాణ సంచా పేల్చి సంబురాలు జరుపుకున్నారు. అనంతరం గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించినట్లు జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు తిరుమల్, రవీందర్, కొంతం గోవర్ధన్‌రెడ్డి, కొమురయ్య, టి. శ్రీధర్‌రెడ్డి, సీహెచ్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
చిక్కడపల్లిలో.. మునుగోడు ఉప ఎన్నికల్లో భారీ మె జార్టీతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించడంతో ఆదివారం సాయం త్రం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో టీఆర్ఎస్ నాయకులు సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, యువజన విభాగం నా యకుడు ముఠా జయసింహ టాపాసులు పేల్చా రు. గాంధీనగర్, కవాడిగూడ, అడిక్‌మెంట్, రాం నగర్, బోలక్పూర్ డివిజన్ల అధ్యక్షులు రాకేశ్ కుమార్, శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌రెడ్డి, మోజస్, వై. శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ ముఠా పద్మానరేశ్, నాయకులు నరేశ్, శ్రీనివాస్ గుప్తా, గడ్డమీది శ్రీనివాస్, శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.