పహాడీషరీఫ్, నవంబర్ 5: ఇల్లు కట్టి చూడు..పెళ్లి చేసి చూడు అనేది నానుడి. అంటే ఈ రెండు అంత ఈజీ కాదని అర్థం. పెళ్లి చేయడం కంటే ఇల్లు కట్టడం చాలా కష్టమైన పని. పునాది నుంచి స్లాబ్ వరకు ఎంతో పని ఉంటుంది. అన్నింటికీ మించి ఇటుక, కంకర, సిమెంట్‌తో ఇతర మెటీరియల్ అవసరముంటుంది. ఇవన్నీ అధిక ధరతో కూడుకున్నది. మధ్యతరగతి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారికి కాస్త భారమే. కానీ ఇసుక, ఇటుక, సిమెంట్ అవసరం లేకుండానే తక్కువ బడ్జెట్లో ఇంటిని సిద్ధం చేసుకోవచ్చు. అది కూడా తక్కువ సమయంలోనే. మార్కెట్లో సరుకులు కొన్నంత సులభంగా.. ఇంటిని కూడా కొనుక్కోవచ్చు. ఇన్నాళ్లూ ఇంటికి సరుకులు తీసుకెళ్లారు. ఇప్పుడు ఎంచక్కా ఇంటినే కొనుక్కుని తీసుకెళ్లవచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా కంటెయినర్ ఇండ్లే ఇప్పుడు ట్రెండ్‌గా మారాయి. ఇల్లు, ఆఫీసు, ఫామ్‌హౌస్.. ఇలా ఏదైనా కంటెయినర్లతో రూపొందించుకోవచ్చు. పహాడీషరీఫ్‌లో ఏ.ఎస్. క్యాబిన్ ఇండస్ట్రీ వారు కావాల్సిన బడ్జెట్లో, కావాల్సిన సదుపాయలతో కంటెయినర్లను తయారు చేస్తున్నారు. చదరపు అడుగులను బట్టి ధరలు ఉన్నాయి. అవసరం ఉనన్ని రోజులు వాడుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు మనతో పాటు ఇంటిని కూడా తీసుకెళ్లవచ్చు.
నెల రోజుల్లో రెడీ…
ఇండ్లకు, ఆఫీసులకు, వెంచర్లలో సెక్యూరిటీ ఆఫీసులకు, టీ సెంటర్లకు క్యాబిన్లను ఆర్డర్‌పై తయారు చేస్తున్నాము. ఆర్డర్ ఇచ్చిన నెల రోజుల్లో వినియోగదారుడి అభిరుచి మేరకు వాస్తు ప్రకారం తయారు చేస్తాము. గ్యారనైజ్డ్ స్టీల్, ఎండీఎం చెక్క బోర్డ్సు, 9 ఎం తిక్స్, అల్యూమినియం విండోస్‌కు సపోర్ట్‌గా ఐరన్ వాడుతాము. బ్రాండెడ్ సామగ్రిని వాడుతాము. 20 నుంచి 25 సంవత్సరాలు గ్యారంటీ ఉంటుంది.
– మహ్మద్ అస్గర్ ఖాన్,ఏ.ఎస్ క్యాబిన్ ఇండస్ట్రీ మేనేజర్