ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 3 : సీనియర్ జర్నలిస్టు మారం శ్రీనివాస్‌కు ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్‌ను ప్రకటించింది. ప్రాచీన భారతదేశ చరిత్ర, సంస్కృతి, ఆర్కియాలజీ (ఏఐహెచ్‌సీఏ) విభాగం ప్రొఫెసర్ కె.వెంకటాచలం పర్యవేక్షణలో ‘హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ తెలంగాణ : 1947-97’అనే అంశంపై పరిశోధన పూర్తి చేసి శ్రీనివాస్ సమర్పించిన పరిశోధనా గ్రంథాన్ని పరిశీలించిన ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచి అధికారులు ఆయనకు పీహెచ్డీ పట్టాను ప్రదానం చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం పెనిమిళ్ల గ్రామానికి చెందిన ఆయన గత పాతికేళ్లుగా పాత్రికేయునిగా పనిచేస్తూ, అనేక దేశాల్లో పర్యటించి ఆయా దేశాల చరిత్ర, సంస్కృతి ఆచార వ్యవహారాలపై ప్రత్యేక వ్యాసాలు, కథనాలు రాశారు.