మేడ్చల్, నవంబర్ 3: విద్యార్థులు నిరంతర శ్రమతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో గురువారం ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాశాలలో చేరిన మొదటి ఏడాది నుంచే విద్యార్థులు లక్ష్యంపై దృష్టి పెట్టాలని సూచించారు.
కార్యక్రమంలో చైర్మన్ చామకూర భద్రారెడ్డి, కార్యదర్శి చామకూర మహేందర్ రెడ్డి, డైరెక్టర్ శాలినీ రెడ్డి, ప్రిన్సిపాల్ రవీంద్ర, వైఎస్ ప్రిన్సిపాల్ డాక్టర్ గోవింద్, కౌన్సిలర్ చింత పెంటయ్య పాల్గొన్నారు. అలాగే ఎంఆర్సీఈడబ్ల్యూ, ఎంఆర్సెట్, ఎంఆర్ఈసీడబ్ల్యూ, ఎంఆర్ఈఐటీఎస్లలో జరిగిన ఓరియంటేషన్ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని విద్యార్థులకు మార్గదర్శనం చేశారు.