సిటీబ్యూరో, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సరూర్‌నగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణికి సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ట్విట్టర్లో శ్రీవాణి పోస్టు చేసింది. ఇది రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఉండటంతో టీఆర్ఎస్వీ నాయకులు దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన అనిరుధ్ సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు గత నెల 28న ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితురాలైన శ్రీవాణికి సైబర్‌క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేస్తూ, ఈ నెల 4వ తేదీన విచారణకు హాజరుకావాలంటూ సూచించారు.