అమీర్పేట్, నవంబర్ 1: హార్ట్ఫుల్నెస్ సంస్థ దాని సహాయ సంస్థలతో కలిసి డిసెంబర్ 16 నుంచి 18 వరకు సంస్థ ప్రధాన కార్యాలయం కన్హాశాంతి వనంలో మొదటి ఇంటిగ్రేటెడ్ హెల్త్ వెల్బీయింగ్ (ఐహెచ్డబ్ల్యూ) 2022 సదస్సు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం ఓ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాన్ఫరెన్స్ కన్వీనర్ ఏక్తా బౌడ్లిక్ వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హార్ట్ఫుల్నెస్ ప్రచారకర్త కమలేష్ పటేల్ ‘దాజి’ ముఖ్యఅతిథిగా విచ్చేయనున్నారని, పలువురు జాతీయ, అంతర్జాతీయ వైద్య, వెల్బీయింగ్ ప్రచారకర్తలు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో ముంబైలోని ఎస్ఎల్ రహేజా ఫోర్టిస్ ఆసుపత్రి కార్డియాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ హరీశ్ మెహతా, ఉస్మానియా వైద్య కళాశాల మాజీ ప్రొఫెసర్ డాక్టర్ పరి ప్లవి మొక్కపాటి, బీబీనగర్ ఎయిమ్స్ బయోకెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ సంగీతా సంపత్ పాల్గొన్నారు.