సిటీబ్యూరో, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): నవంబర్ 12న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌పై మనోరంజన్ కోర్టు కాంప్లెక్స్ జ్యుడీషియల్ అధికారులు, లాయర్లు, వివిధ బ్యాంకుల అధికారులు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్‌తో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జడ్జి పాపిరెడ్డి మాట్లాడుతూ.. నవంబర్ 12న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేసేందుకు ప్రతి ఒకరూ కృషి చేయాలని కోరారు. అలాగే, బ్యాంక్ అధికారులతో పాటు ఇతర పార్టీలకు నోటీసులు జారీ చేసి, అధిక సంఖ్యలో ఎన్.ఐ. చట్టం (చర్చించదగినవి), చెక్ బౌన్స్ కేసులను లోక్ అదాలత్‌లో పూర్తయ్యేలా చూడాలన్నారు. అధిక సంఖ్యలో కంపౌండబుల్ క్రిమినల్, కుటుంబ తగాదాల కేసులను రాజీ కుదిర్చేలా చూడాలని సూచించారు.
ఈ సమావేశంలో 1వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కుష, చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దుర్గాప్రసాద్, మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్ లోక్ అదాలత్‌కు వెళ్లేవారికి పలు సూచనలు, పరిషారాలు తెలియజేశారు. సత్వర న్యాయం, కేసుల పరిషారానికి లోక్ అదాలత్ ఉపయోగపడుతుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మనోరంజన్ కోర్టు కాంప్లెక్స్ జ్యూడీషియల్ ఆఫీసర్లు, బ్యాంక్ అధికారులు, ఫైనాన్షియల్ ఇనిస్ట్టిట్యూషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.