మాదాపూర్, అక్టోబర్ 29: గర్భధారణ సమయంలో మహిళలు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తున్నదని, దాన్ని అధిగమించడానికే మిసెస్ మామ్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు మిసెస్ మామ్స్ డైరెక్టర్, డాక్టర్ శిల్పిరెడ్డి తెలిపారు. కొండాపూర్లోని కిమ్స్ దవాఖానలో శనివారం ఏర్పాటు చేసిన మిసెస్ మామ్స్ ఆరో సీజన్లో మిసెస్ మామ్స్ డైరెక్టర్, డాక్టర్ శిల్పిరెడ్డి కిమ్స్ దవాఖాన వైద్య బృందంతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మిసెస్ మామ్ ఆరో సీజన్లో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1306 మంది గర్భిణులు వారి పేర్లను నమోదు చేసుకొన్నారని తెలిపారు. మిసెస్ మామ్ కార్యక్రమంతో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించి గర్భం దాల్చిన అనంతరం ఏ విధంగా ఉండాలి..?ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? వ్యాయామాలు ఎలా చేయాలి..? అనే విషయాలపై గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. మిసెస్ మామ్ ఆరో సీజన్లో నారాయణపేట చేనేత చీరలను దేశీ కాలర్ సంస్థకు చెందిన మానసీ అగర్వాల్ గర్భధారణకు అనుకూలంగా ఉండేలా డిజైన్ చేశారు. నారాయణపేట కలెక్టర్ హరిచందన సహాయంతో చేనేత రంగాన్ని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఆమె తెలిపారు.
మిసెస్ మామ్ 2022 షెడ్యూల్ వివరాలు