సిటీబ్యూరో, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): పట్ణణాల్లోనే బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని, అందులో 30ఏండ్లకే రొమ్ము క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నారని టాలీవుడ్ నటి ప్రయమణి పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్-అక్టోబర్ 2022లో భాగంగా జూబ్లీహిల్స్‌లోని అపోలో క్యాన్సర్ ఇనిస్టిట్యూట్స్‌లో రొమ్ము క్యాన్సర్ నివారణపై అవగాహన నిర్వహించారు. బ్రెస్ట్ క్యాన్సర్ స్రీనింగ్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా టాలీవుడ్ నటి ప్రియమణి హాజరై మాట్లాడుతూ.. రొమ్ము క్యాన్సర్‌పై సామూహికంగా చైతన్యం చేయాల్సిన అవసరముందని అన్నారు. అనంతరం అపోలో క్యాన్సర్ ఇనిస్టిట్యూట్స్ డైరెక్టర్ డాక్టర్ విజయ్‌ఆనంద్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి 8మంది మహిళల్లో ఒకరు ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు తెలిపారు.ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం, పౌష్టికాహారం తీసుకోవడం,వ్యాయామం చేయడం, నిర్ణీత వయస్సు తరువాత వైద్య పరీక్షలను చేసుకోవడం ద్వారా రొమ్ము క్యాన్సర్‌ను అరికట్టవచ్చని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాము దాములూరి, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కె.శిల్పారెడ్డి, ఆంకాలజిస్ట్‌ల బృందం పాల్గొన్నారు.