ఎల్బీనగర్, అక్టోబర్ 28: కరోనా సోకిందని ప్రజలు కలత చెందవద్దని, నాలుగైదు రోజుల్లో కోలుకుని రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారం కోసం సమావేశం ఏర్పాటు చేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం తన నివాసంలో తనను కలిసేందుకు వచ్చిన రిజిస్ట్రేషన్ సమస్యలు ఉన్న కాలనీవాసులతో సామాజిక దూరం పాటిస్తూ నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. తనకు కరోనా రావడంతో మంత్రి కేటీఆర్‌తో జరగనున్న సమావేశం వాయిదా పడుతుందన్న ఆందోళనలో ఉన్న కాలనీవాసులకు సమావేశం వాయిదా వేయకుండా త్వరలోనే ఏర్పాటు చేయిస్తానని హమీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్ సమావేశాన్ని తాను కరోనా నుంచి పూర్తిగా కొలుకున్న మీదట మరో ఐదు రోజుల్లో ఏర్పాటు చేస్తానని, ఈ సమావేశంలో ప్రభుత్వం తరపున జీవో కాపీని ఇచ్చి సమస్యలకు ముగింపు పలుకుతారని హామీ ఇచ్చారు. ఈ సమావేశాన్ని కాలనీవాసులంతా పూర్తి బాధ్యత తీసుకుని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అనంతుల రాజారెడ్డి, నాగోలు డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు తూర్పాటి చిరంజీవి, బీఎన్‌రెడ్డినగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్‌రెడ్డి, న్యూటన్, రాఘవేందర్రావు, వైదేహీనగర్కు చెందిన పోగుల రాంబాబు, గుజ్జ జగన్మోహన్, బీఎన్‌రెడ్డినగర్, నాగోలు డివిజన్లోని పలు కాలనీల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.