కందుకూరు, అక్టోబర్ 28 : వ్యవసాయం చేస్తున్న రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రైతు బీమాతో అన్నదాతలకు భరోసాను కల్పిస్తుంది. వ్యవసాయం చేసే రైతు ఏ కారణంతో మరణించినా అతడి కుటుంబం రోడ్డున పడకూడదు, ఆర్థిక ఇబ్బందులతో సతమతం కాకూడదు, పిల్లలు చదువులు ఆగిపోకూడదు అనే గొప్ప సంకల్పతంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘రైతు బీమా’ పథకం అన్నదాతల కుటుంబాలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నది. ప్రతి ఏడా ది ఆగస్టు నెలలో రైతులకు సంబంధించి బీమా ప్రీమి యం డబ్బులను ప్రభుత్వమే చెల్లించడం జరుగుతుంది. ఏ కారణంతోనైనా రైతు మృతి చెందిన వారం, పది రోజు ల వ్యవధిలోనే నామిని ఖాతాల్లో రూ.5లక్షలు రైతు బీమా పరిహారం జమచేస్తున్నారు. ఎలాంటి పైరవీ, అవినీతికి అస్కారం లేకుండా నేరుగా రైతు కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహయం అందిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం 2018వ సంవత్సరంలో రైతు బీమా పథకం ప్రారంభించిన్పటి నుంచి నియోజకవర్గంలో 659 మంది రైతులకు పరిహారం అందించింది. దీంతో ఎంతో మంది అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తూ.. కష్టకాలంలో తమ కుటుంబాలకు అండగా నిలుస్తూ, తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని చెబుతున్నారు.
ఇప్పటికి వర కూ మహేశ్వరం నియోజరవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం బాధిత రైతు కుటుంబాలకు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. కందుకూరు మండలంలో 216 మంది రైతులకు రూ.10.80 లక్షలు, మహేశ్వరం మండలంలో 170 మంది రైతులకు రూ.8.50 లక్షలు, బాలాపూరు మండలంలో 18మంది రైతులకు రూ.90లక్షలు, ఆమనగల్లు, మండలంలో 117మంది రైతులకు రూ.5.85 లక్షలు, కడ్తాల్ మండలంతలో 138 మంది రైతులకు రూ.6.90 లక్షలు.. మొత్తంగా 659మంది రైతులకుగాను రూ. 32.95లక్షల రూపాయలను చెల్లించింది. అలాగే వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్, ఎకరానికి రూ.10 వేలు పెట్టుబడి సాయం, గిట్టుబాటు ధరను కల్పించి అన్నదాతలకు అండగా నిలుస్తుండడంతో రైతులు ఆనందాన్నివ్యక్తం చేస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దీవెనతలతో ముంచేత్తుతున్నారు.
నామిని బ్యాంక్ ఖాతాలో జమ..
ఏ కారణంతోనైనా అన్నదాత మరణిస్తే.. రైతు బీమా పథకంతో వారం పది రోజుల్లో నామిని బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నామని మహేశ్వరం డివిజన్ వ్యవసాయ శాఖ ఏడీఏ సుజాత తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
రైతులు సీఎంకు రుణపడి ఉంటారు..
నిరతంరం రైతుల సంక్షేమ కోసం కట్టుబడి ఉన్నా సీఎం కేసీఆర్‌కు రైతులు రుణపడి ఉంటారు. ఏ కారణం చేతనైనా గుంట భూమి ఉన్న రైతు చనిపోయిన సరే.. ఎలాంటి పైరవీ లేకుండా నామిని బ్యాంక్ ఖాతాల్లో వారంలోపై జమ అవుతున్నాయి. ఇంతటి మంచి నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి.
– సోలిపేట అమరేందర్‌రెడ్డి,రైతు విభాగం అధ్యక్షుడు, కందుకూరు మండలం
రూ.5 లక్షలు వచ్చాయి..
భర్త చనిపోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్న తనకు తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షలను బ్యాంక్ ఖాతాలో జమచేసి తమ కుటుంబాన్ని ఆదుకుంది. ఈ డబ్బులతో తన చిన్న కూతురు వివాహనికి సహయపడుతాయి. సీఎం కేసీఆర్ చల్లగా ఉండాలి. మా లాంటి నిరుపేదలను ఆపదలో ఆదుకుంటున్న నిజమైన దేవుడు కేసీఆరే.
– అక్కనపల్లి ఇందిరమ్మ, కొత్తగూడ