మౌలిక వసతుల కల్పనతో ఎర్రకుంట వాసులు హర్షం
పహాడీషరీఫ్, అక్టోబర్ 28: మా కాలనీకి మంచి రోజులొచ్చాయని ఎర్రకుంట వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో గుంతలు పడ్డ మట్టి రోడ్లతో ప్రయాణించలేని పరిస్థితి. ప్రతి నిత్యం అవస్థలు పడ్డామని, తెలంగాణ ప్రభుత్వంలో వచ్చాక రూ.60 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు ఏర్పాటు వేశారు. గత పాలకులు అభివృద్ధిని విస్మరించారు. ప్రస్తుతం టీఆర్ఎస్(బీఆర్ఎస్) ప్రభుత్వంలో కాలనీ మౌలిక సమస్యలు దశల వారీగా పరిష్కారమవుతున్నాయి. తమ కాలనీలో ప్రధానమైన డ్రైనేజీ, రోడ్డు సమస్య పరిష్కారం కావడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీసీ రోడ్డుతో మా కాలనీకి ఒక కళ వచ్చింది:
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రైనేజీ, రోడ్డు, వీధి దీపాలు తదితర మౌలిక వసతులు తీరుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇంటింటికి శుద్ధి చేసిన నీటిని అందజేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి పనుల మంచిగా ఉన్నాయి. సీసీ రోడ్డు ఏర్పాటు చేయడంతో మా కాలనీకి ఒక కళ వచ్చింది. పాదచారుల, వాహనదారుల ఇబ్బందులు పూర్తిగా తొలిగిపోయాయి.
– మక్సూద్దీన్ హమ్దాన్, సందేశ్నగర్ వాసి
గత పాలకులు పట్టించుకోలే..
ఎర్రకుంట నుంచి కొత్తపేటకు వెళ్లాలంటే షాహీన్‌నగర్ నుంచి ఉస్మాన్‌నగర్ మీదుగా వెంకటాపూర్ నుంచి కొత్తపేటకు 5 కిలోమీటర్లు ప్రయాణించాలి. కానీ ఎర్రకుంట నుంచి తక్కువ సమయంలో రెండు కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణించే కొత్తపేటకు వెళ్లే రహదారి ఇది. రహదారి మధ్యలో గుంతలు ఏర్పడి నడవడానికి వీలులేకుండా ఇబ్బందింగా ఉండేది. వాహనదారులు అదుపు తప్పి ప్రమాదాల బారిన పడేవారు. గత పాలకులు ఎవరూ కూడా రోడ్డు సమస్యను పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిధులు కేటాయించడంతో ఎర్రకుంట నుంచి సందేశ్నగర్ వెళ్లే దారిలో సీసీ రోడ్డు అభివృద్ధి చేశారు. కాలనీ వాసులు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– ఎం.ఏ, హుస్సేన్, ఎర్రకుంట టీఆర్ఎస్ నాయకుడు
దశల వారీగా అభివృద్ధి పనులు
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సహకారంతో మున్సిపల్ పరిధిలో మున్సిపల్ కమిషనర్ వసంతతో కలిసి అత్యవసరం ఉన్న ప్రాంతా ల్లో కోట్లాది రూపాయలతో డ్రైనేజీ, సీసీ రోడ్డు తదితర అభివృద్ధి పనులను దశలవారీగా చేపడుతున్నాము. మున్సిపల్ పరిధిలో ప్రతి కాలనీ, బస్తీలలో మౌలిక వసతులు సమకూరేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం.
– అబ్దుల్లా సాది, జల్పల్లి మున్సిపాలిటీ చైర్మన్