సికింద్రాబాద్, అక్టోబర్ 28: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. బోర్డు పరిధిలోని రెండవ వార్డు అర్జున్‌నగర్ మార్కేండేయ ఆ లయం వద్ద శుక్రవారం 71మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో ఆడపిల్ల పుడితే తల్లిదండ్రులు భారంగా భావించేవారని, ఇప్పుడు అదృష్టంగా భావిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారని, ఆడపిల్ల పుడితే రూ.13వేలు, మగపిల్లవాడైతే రూ.12వేలతో పాటు కేసీఆర్ కిట్లు ఇచ్చి ప్రభుత్వ వాహనంలోనే తల్లీబిడ్డను క్షేమంగా ఇంటికి చేరుస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో లేవని చెప్పారు. ఆసరా పింఛన్లు అభాగ్యులకు కొండంత అండగా నిలుస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మండల తాసీల్దార్ హసీనా బేగం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, నేతలు నివేదిత, మార్కెట్ మాజీ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్, సదానంద్‌గౌడ్, సంతోష్, మురళీయాదవ్, తేజ్‌పాల్, వార్డు అధ్యక్షుడు కుమార్ ముదిరాజ్, నాగరాజ్, మహేశ్, జిలానీ, నగేశ్, సురేశ్, జగ్గారావు, షేక్‌గౌస్, వాహెబ్, ప్రకాశ్, భిక్షపతి, మహేందర్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఆపదలో ఉన్నవారికి ఆర్థిక భరోసా..
అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి దవాఖానల్లో చికిత్స పొందిన వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా నిధులు మంజూరు చేసి సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని ఎమ్మెల్యే సాయన్న పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం కార్ఖానాలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారురాలికి రూ.18వేల చెక్కును ఎమ్మెలే అందజేశారు. మడ్‌ఫోర్డ్ న్యూ అంబేడ్కర్ నగర్‌కు చెందిన డి. బాలమ్మ అనారోగ్య సమస్యలతో గత కొంత కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యే సాయన్నను సంప్రదించగా సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేయించారు. దీంతో సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.18వేల చెక్కు మంజూ కాగా లబ్ధిదారురాలికి అందించారు. . ఆదే విధంగా ఐదో వార్డు సంజీవయ్యనగర్‌కు చెందిన పెంటయ్యకు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన సుమారు రూ.1.25లక్షల ఎల్వోసీని లబ్ధిదారు కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో సాంబ ఆశోక్, సదానంద్‌గౌడ్, పనస సంతోష్, తేజ్‌పాల్, వెంకట్రాముడు, సాయికృష్ణ, కనక సుందర్, శ్రీనివాస్, మల్లేశ్‌తో పాటు డొక్కా హుస్సే న్ తదితరులు పాల్గొన్నారు.