శంషాబాద్ రూరల్, అక్టోబర్ 26 : తపాలా బీమా జీవితానికి ధీమా కల్పిస్తోంది. దీంతో చాలా మంది బీమా చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ప్రమాద బీమా చేసుకుంటున్నారు. అందులో భాగంగా పోస్టు ఆఫీస్ మంచి ప్రణాళిక తయారు చేసింది. తపాలాశాఖ కొత్తగా ప్రవేశపెట్టిన పోస్టల్ బీమా పథకానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తున్నట్లు తపాలాశాఖ ఉద్యోగులు వివరిస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతో రూ. 10 లక్షల వరకు ప్రమాదబీమా సౌకర్యం ఉండటంతో ప్రజలు తపాలాశాఖలో ఖాతాలు ప్రారంభిస్తున్నారు. పాముకాటుతో మరణించిన అంగవైకల్యం జరిగిన , విద్యుత్‌షాక్‌తో మరణించిన బీమా వర్తిస్తుంది. అనారోగ్యానికి గురై దవాఖానలో చేరిన ఇన్సూరెన్స్ వస్తుందని అధికారులు తె లుపుతున్నారు.
పాలసీ దారుడు 18 ఏండ్ల నుంచి 65 సంవత్సరాల వరకు అవకాశం ఉంది. పాలసీ వ్యవధి ఏడాది పాటు ఉంటుంది. ప్రీమియం రూ. 399లు మాత్రమే, ప్రమాదంలో పాలసీదారుడు మరణించిన, ప్రమాదం ద్వారా మొత్తం, పాక్షిక వైకల్యం సంభవించిన, పక్షవాతం సంభవించిన రూ.10 లక్షలు నామినికి చెల్లించనున్నట్లు తెలిపారు. విద్యాప్రయోజనం, లక్ష వరకు (గరిష్ఠంగా ఇద్దరు పిల్లలకు), ప్రమాదవశాత్తు వైద్య ఖర్చులు 24 గంటలు దాటి దవాఖానలో ఉంటే రూ. 60వేల వరకు చెల్లిస్తుంది. 24 గంటలలోపు దవాఖాన నుంచి డిశ్చార్జి అయితే రూ.30 వేలు చెల్లిస్తారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి దవాఖానకి కుటుంబ సభ్యులు చేరుకోవడానికి అయ్యే ఖర్చు రూ. 25వేలు చెల్లిస్తారు.
కేవలం రూ. 399లకే బీ మా సౌకర్యం కల్పిస్తున్న తపాలాశాఖలో ఖాతాదారులుగా చేరి దీమాగా ఉండాలి. త క్కువ ఖర్చుతో రూ.10 లక్షల వరకు బీమా కల్పిస్తున్న అవకాశాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలి.
-సునీత, తపాలాశాఖ అధికారి