బాలానగర్, అక్టోబర్ 26 : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం ఫతేనగర్ డివిజన్లో రూ.7 కోట్ల 70 లక్షల 20 వేలతో పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ పండాల సతీశ్‌గౌడ్‌తో కలిసి శ్రీకారం చుట్టారు.
అమృత్‌నగర్ తండా నుంచి కార్మికనగర్ కల్వర్ట్ మీదుగా బిగ్భాస్కట్ వరకు రూ.5.96 కోట్ల నిధులతో నాలా చుట్టూ రిటైనింగ్‌వాల్ నిర్మాణ పనులు, అమృత్నగర్తాండలో టాయ్‌లెట్ రీమోడలింగ్ పనులు కోసం రూ.9.20 లక్షలు, ఫతేనగర్ మెయిన్‌రోడ్డులో వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులకు గాను రూ.40 లక్షలు, అక్షయ్ఎన్క్లేవ్ నుంచి ఓల్డ్ఏయిర్పోర్ట్ రోడ్డు వరకు వీడీసీసీరోడ్డు నిర్మాణ పనులకు రూ.30 లక్షలు, గౌతంనగర్ మెయిన్‌రోడ్డు నుంచి ఓల్డ్ఏయిర్పోర్ట్ రోడ్డు వరకు సీసీరోడ్డు పనులకు రూ.25 లక్షలు, నేతాజీకాలనీ సంతోషిమాత ఆలయం లేన్ రోడ్డు నిర్మాణ పనులకు రూ.25 లక్షలు, పిట్టలబస్తీలో కమ్యూనిటీహాల్ నిర్మాణ పనులకు గాను రూ.45 లక్షలు కేటాయించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు వందశాతం మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
కూకట్పల్లి నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల మేరకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో అలుపెరుగని కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, తాగునీరు లాంటి కనీస వసతుల కల్పనకు అలుపెరుగని కృషి చేస్తున్నట్లు ఆయన అన్నారు. కార్పొరేటర్ సతీశ్‌గౌడ్ మాట్లాడుతూ.. ఫతేనగర్ డివిజన్ సమగ్రాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు భిక్షపతి, బాగయ్య, సలావుద్దీన్, శశి, శిల్ప, కీర్తి స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
కేపీహెచ్‌బీ కాలనీ, అక్టోబర్ 26 : తాగునీటి పైప్‌లైన్ పనులను వేగవంతం చేయాలని, తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జలమండలి అధికారులను ఆదేశించారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జలమండలి అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలలో చేపట్టిన తాగునీటి పైప్‌లైన్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. పైప్‌లైన్ పనులు చేస్తున్నప్పుడు ఆయా ప్రాంతాలలో ప్రజలకు తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జలమండలి జీఎం.ప్రభాకర్‌రావు, మేనేజర్లు, సిబ్బంది ఉన్నారు.