మల్కాజిగిరి, అక్టోబర్ 23: మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. ఆదివారం మచ్చ బొల్లారం డివిజన్, కౌకూర్‌లో సందల్ ఏ ముబారక్‌ను పురస్కరించుకుని ‘సయ్యద్ కరీముల్లా షా ఖాద్రి మస్తాన్ బాబా దర్గా’ లో ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు చేసి, చాదర్‌ను సమర్పించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనారిటీ విద్యార్థుల చదువుల కోసం రెసిడెన్సియల్ స్కూళ్లను ప్ర భుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు.
ఉచితంగా బుక్స్, యూనిఫాం, భోజన వసతిని కల్పిస్తున్నదని అన్నారు. ఇంట్లో ఆడబిడ్డ పెండ్లికి షాదీముబారక్ పథకంలో రూ.1,00,116ల ఆర్థిక సహాయం అందజేస్తున్నదని అన్నారు. అందరూ సోదరభావంతో కలసిమెలసి ఉండాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్, సయ్యద్ ఆయూబ్, సయ్యద్ అస్లాం, సయ్యద్ ముస్తఫా, సురేందర్‌రెడ్డి, మల్లికార్జున్, వెంకటేశ్‌యాదవ్, శోభన్‌బాబు, వెంకటేశ్‌గౌడ్, సతీశ్, అలిక్పాషా పాల్గొన్నారు.