పీర్జాదిగూడ, అక్టోబర్ 23: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్ల విస్తరణకు చర్యలు చేపట్టారు. నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతి డివిజన్లలో ప్రధాన రోడ్లు అభివృద్ధిలో భాగంగా మేడపల్లి మహంకాళి ఆల యం వద్ద నుంచి పంచవటి కాలనీ కమాన్ వరకు సీసీ రోడ్డు పనులు పూర్తి అయ్యాయి. వరంగల్ జాతీయ రహదారికి దగ్గరగా ఉన్న పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలో రోజురోజుకు పుట్టుకొస్తున్న కాలనీలతో జనాభా పెరగడంతో వాహనాల సంఖ్య అధికమవడం వల్ల ఈ రోడ్డుగుండా ప్రయాణించే ప్రయాణికులకు నిత్యం ఉదయం సాయంత్రం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొనేవారు. పాలక వర్గం చొరవతో కౌన్సిల్ తీర్మానించడంతో రోడ్ల విస్తరణకు నోచుకుంది.
ఇదివరకే పర్వతాపూర్ అరోరా ఇంజినీరింగ్ కళాశాల నుంచి మేడిపల్లి పంచవటికాలనీ రోడ్డును విస్తరించారు. ఇటీవల మేడిపల్లి మహంకాళి ఆలయం వరకు ఉన్న రోడ్డును రూ. 50 లక్షల మున్సిపల్ నిధులతో విస్తరించారు.గతంలో 14 ఫీట్ల వెడల్పులో ఉన్న రోడ్డును ప్రస్తుతం 30 నుంచి 36 ఫీట్ల సీసీ రోడ్డుగా విస్తరించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఈ రోడ్డు విస్తరణ పనులకు అధికారులు, పాలక వర్గం చొరవతో రోడ్డు పనులు పూర్తి చేశారు. కొంతకాలంగా అధ్వానంగాఉన్న ఈరోడ్డులో ఇబ్బందులు తప్పడంలో ప్రయా ణం సునాయసంగా సాగుతుందని పలువురు పేర్కొంటున్నారు. రోడ్డు విస్తరణతో పాటు నిర్మాణ పనులు పూర్తి అవడం అద్దంలా కనిపిస్తున్న రోడ్డును చూసి స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రోడ్ల విస్తరణకు చర్యలు తీసుకుంటున్నాం..
పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో ప్రధాన రోడ్ల విస్తరణకు చర్యలు తీసుకుంటున్నాం. కార్పొరేషన్ సుందరీకరణలో భాగంగా అన్ని ప్రాంతాల అభివృద్ధ్దికి కృషి చేస్తున్నాం. ప్రతి డివిజన్ అద్దంలా కనిపించేలా సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నాం. అన్ని వర్గాల ప్రజల సహకారంతో కార్పొ రేషన్ అభివృద్ధ్దికి మరింత కృషి చేస్తాం.
– పీర్జాదిగూడ కార్పొషన్ మేయర్ జక్క వెంకట్రెడ్డి
పనుల్లో నాణ్యత చేపట్టేలా చర్యలు
కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. అభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నాం. మేడిపల్లి మహంకాళి గుడి నుంచి చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను 14 ఫీట్ల నుంచి 36 ఫీట్ల వరకు విస్తరణ చేశాం.
-మున్సిపల్ కార్పొరేషన్ డీఈ శ్రీనివాస్.