ఉప్పల్, అక్టోబర్ 23 : ఉప్పల్ జైభీమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ మేధావికి మణిహారం కార్యక్రమంలో భాగంగా ఉప్పల్‌లోని నాలెడ్జి పార్కులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ.. బాబా సాహెబ్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మహనీయుల స్ఫూర్తి తో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్, సత్యరాజ్, రాజు, గుండె రాజు, బాలరాజు, బాల పోచయ్య, రాపోలు రవి, మస్క ధన్‌రాజ్, బాలకృష్ణ, శ్రీకాంత్, క్రాంతి రాజు, రమేశ్, వెంకటేశ్ పాల్గొన్నారు.
ఈసీఐఎల్ చౌరస్తాలో…
కాప్రా, అక్టోబర్ 23: తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో ఆదివారం ఈసీఐఎల్ చౌరస్తాలో అంబే ద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్ఫూర్తి గ్రూప్ సభ్యులు రహీం, గగన్, శివరామకృష్ణ , శ్రీమన్నారాయణ, అంబేద్కర్ కు పూలమాలలు సమర్పించారు. స్ఫూర్తిగ్రూప్ సభ్యులు యాదగిరి రావు మాట్లాడుతూ.. దేశంలో రాజ్యాంగ వ్యవస్థను నాశనం చేసేవిధం గా కుట్రలు జరుగుతున్నాయని, వాటికి వ్యతిరేకంగా పోరాటం చేసి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ప్రసాద్‌బాబు, రహీం, గగన్, న్యాయవాది ప్రభుదాస్, నాగేశ్వర్రావు, రాజమల్లు, బ్యాగరి వెంకటేశ్, ప్రభాకర్, స్వామి, తదితరులు పాల్గొన్నారు.