గౌతంనగర్, అక్టోబర్ 22 : సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంతో ప్రజలు బీఆర్ఎస్(టీఆర్ఎస్) వైపే ఉన్నారని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నా రు. శనివారం గౌతంనగర్ డివిజన్, ఉత్తమ్‌నగర్‌లో రూ.30లక్షలు, న్యూ వెంకటేశ్వరనగర్‌లో రూ.10లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జరుగుతున్న అభివృద్ధి సంక్షేమంతో బీఆర్ఎస్ పార్టీకి ప్రజా అభిమా నం పెరుగుతున్నదని అన్నారు. ఆదర్శ నియోజకవర్గంగా మల్కాజిగిరిని తీర్చిదిద్దుతామన్నారు. దాదాపుగా డ్రైనేజీ సమస్యలు పూర్తి చేశామని, పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ పనులను దశలవారీగా పూర్తి చేస్తామని తెలిపారు.
మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థే గెలుపు..
టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధికే ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మోజార్టీతో గెలిపిస్తారని ఎమ్మెల్యే అన్నారు. మునుగోడులో ఎక్కడికి వెళ్లినా టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. దేశంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధి ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వమే చేస్తుందన్నారు. ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలే అభ్యర్థిని గెలిపిస్తాయని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రజల ఆదరణ కరువైయిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మేకల సునీతారాముయాదవ్, డీఈ లౌక్య, ఏఈ దివ్యజ్యోతి, మాజీ కార్పొరేటర్ జగదీశ్‌గౌడ్, మేకల రాముయాదవ్, కాలనీ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.